Vishwak Sen: హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందీ సినిమా. కంటెంట్ పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో నేటి రోజుల్లో వచ్చిన మంచి సినిమా అంటూ తన అభిప్రాయాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేశారు మరో హీరో విశ్వక్ సేన్.
‘లక్కీ భాస్కర్ సినిమా చూశా. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాల్లో ఇదొకటి. దర్శకుడు వెంకీ అట్లూరి అద్భుతంగా తెరకెక్కించారు. తన సినిమాల్లో ఇదొక అత్యుత్తమ సినిమా. దుల్కర్ తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. మీనాక్షీ చౌదరి అద్భుతంగా నటించింది. ప్రేక్షకులు సినిమాను ధియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సినిమా మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
విశ్వక్ సేన్ అభినందనపై దుల్కర్ స్పందించారు. ‘థ్యాంక్యూ బ్రదర్. సినిమా మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. మీ మెకానిక్ రాకీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని రిప్లై ఇచ్చారు. వీరిద్దరి పోస్టులపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.