బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో ఒకింత కన్‌ఫ్యూజన్ ఎక్కువగా వున్న కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విష్ణు ప్రియ అనే.! వీకెండ్ ఎపిసోడ్స్‌లో డాన్సులు బాగా చేయడం, కాస్తంత గ్లామర్ షో చేయడం తప్ప, హౌస్‌లో టాస్కుల సందర్భంగా విష్ణు ప్రియ పెద్దగా చేసిందేమీ లేదు.
ఈ సీజన్‌లో రొమాంటిక్ టచ్ కోసం పృధ్వీకి జోడీగా విష్ణు ప్రియని అలా వుంచినట్లే కనిపిస్తోంది. పృధ్వీని ఆమె ఎందుకు ఇష్టపడుతోందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎలాగైతేనేం, పలుసార్లు నామినేట్ అయి, సేఫ్ అయిపోయిన విష్ణు ప్రియ, దాదాపు ఫినాలే వరకూ వచ్చేసింది. జస్ట్ ఆ ఫినాలేకి ఓ అడుగు దూరంలో వుందంతే.
అయినాగానీ, బిగ్ బాస్ అంటే ఏంటో ఆమెకి ఇప్పటికీ అర్థమయినట్లు లేదు. తాజా ఎపిసోడ్‌లో, ‘టాస్కులు బాగా ఆడినోళ్ళు టైటిల్ గెలిచిన దాఖలాలు లేవు..’ అన్నట్లుగా మాట్లాడేసింది తనదైన స్టయిల్లో విష్ణు ప్రియ. అదీ నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.
ఆడితే గెలవరు.. అన్నది విష్ణు ప్రియ ఉవాచ. అందుకే, విష్ణు ప్రియ గెలవడంలేదట. విష్ణు ప్రియ ఇలా అనేసరికి, హోస్ట్ అక్కినేని నాగార్జున షాక్ అయ్యాడు. అదేంటమ్మా అలా అనేశావ్.? బిగ్ బాస్‌ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు.. ఓవరాల్ పెర్ఫామెన్స్ ఆధారంగా టైటిల్ విన్నర్ అవడం జరుగుతుంది కదా.. అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
‘నా ఉద్దేశ్యం అది కాదు సార్.. గెలిచినా, ఓడినా.. గెలవడం కోసం నేను పడ్డ కష్టం ఆడియన్స్‌కి అర్థమవ్వాలి..’ అని విష్ణు ప్రియ ఆ తర్వాత తీరిగ్గా సెలవిచ్చింది.
నిజమే, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో బాగా ఆడితే ఉపయోగం వుండదు. బిగ్ బాస్‌ని మెప్పించాలి. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా చేయగలిగిందేమీ వుండదు. ఆ విషయం పలు సీజన్లు చూసిన విష్ణు ప్రియకి తెలియకుండా వుంటుందా.?
ఇంతకీ, విష్ణు ప్రియ తెలిసీ తెలియక ఆ డైలాగ్ పేల్చిందా.? బిగ్ బాస్ పరువు తీసెయ్యాలని డిసైడ్ అయ్యి అలా అనేసిందా.? ఏదైతేనేం, విష్ణు ప్రియ నిజమే చెప్పింది.