Switch to English

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం తన ప్యానెల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ విద్యానికేతన్ లో మీడియా సమావేశం నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఎన్నికల్లో గెలిస్తే శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. గెలుపోటములు సహజం. ఈసారి మేము గెలిచాం.. తర్వాత వారు గెలవొచ్చు.

పోలింగ్ సమయంలో చిన్నచిన్న గొడవలు జరిగాయి. ఇరువైపులా తప్పులున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం. ప్రకాశ్ రాజ్ కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూసుకోవచ్చు. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో నేను, పవన్ కల్యాన్ ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడుకోలేదు. అంతకుముందే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. స్టేజి మీద జరిగింది మాత్రమే మీడియాకు తెలిసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకే స్టేజీపై పవన్ వీడియోను షేర్ చేశాను. చిరంజీవి గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాన్నతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. ఆ విషయాలు నాన్నగారినే అడగాలి.

ప్రకాశ్ రాజ్, నాగబాబు గారి రాజీనామాలు మేము ఆమోదించడం లేదు. వారందరి రాజీనామా విషయం నేను మీడియాలోనే చూశాను. ఒక్కరి నుంచే రాజీనామా వచ్చింది. మిగిలిన వారి రాజీనామాలు వచ్చాక మేము కలిసి కూర్చుని చర్చించి.. పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.

‘విష్ణు చదువుకున్న వ్యక్తి. సంస్కారం ఉంది. అందరినీ కలుపుకుపోతాడు. మ్యానిఫెస్టోని అంశాలన్నింటినీ నెరవేరుస్తాడు. మేమంతా ఒకే తల్లి బిడ్డలం. ఎన్నికల్లో జరిగినదాన్ని మేము మర్చిపోతున్నా.. ప్రత్యర్ధి ప్యానెల్ వదలట్లేదు. ఈ రెండేళ్లే కాదు.. ఆపై రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా ఉంటాడు’ అని బాబూమోహన్ అన్నారు.

‘ఎన్నికల వరకే మేము ప్యానెల్స్ గా విడిపోయాం. ఎన్నికలయ్యాక మేమంతా ఒకటే. విష్ణు మ్యానిఫెస్టోనే మమ్మల్ని గెలిపించింది. మా సభ్యుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం’ అని మా వైస్ ప్రెసిడెంట్, నటుడు మాదాల రవి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

స్కైల్యాబ్ మూవీ రివ్యూ

నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ స్కైల్యాబ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ...

శివాని మరో సినిమా ఓటిటి రిలీజ్

సురేశ్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్...

బిగ్ బాస్ 5: మొదటి ఫైనలిస్ట్ శ్రీరామ్, మరి సిరి పరిస్థితి?

బిగ్ బాస్ 5 లో మొత్తానికి టికెట్ టు ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ లో భాగంగా మొన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు ఎలిమినేట్...

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

రాజకీయం

జస్ట్ ఆస్కింగ్: ఇవి వైసీపీ సర్కారు వైఫల్యాలు కావా.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? ఈ ప్రశ్నకు సమాధానం, ‘ప్రస్తుతానికైతే అమరావతి’ అని. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది.? గతంలో అయితే 2021 జూన్, మొన్నటిదాకా 2021 డిసెంబర్.. ఇప్పుడేమో డేట్ తెలియదు అనే...

తప్పు తెలుసుకుంటున్న వైసీపీ.. చంద్రబాబు గెలిచినట్టే.!

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు జారిన నెల రోజుల తర్వాత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంట కన్నీరు వచ్చింది. సరే, వంశీని...

జస్ట్ ఆస్కింగ్: తెలుగు నాట ఆ ప్రాజెక్టులు ఎంత భద్రం.?

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది.. తప్పు నీదంటే, నీదంటూ అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటోన్న విషయం విదితమే. ‘అప్పుడు మీరేం చేశారు.?’ అన్న ప్రశ్న అధికార వైసీపీ...

ప్రజలకు ఆస్తినిస్తున్నారా.? ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారా.?

ఓటీఎస్.. అదేనండీ వన్ టైమ్ సెటిల్మెంట్.. ఈ పేరిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘మేం అధికారంలోకి వస్తే, ఓటీఎస్ ఉచితంగానే చేసిస్తాం..’ అంటోంది తెలుగుదేశం పార్టీ. అధికార వైసీపీ మాత్రం,...

తప్పు చంద్రబాబుది.. గొప్ప వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.!

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అనూహ్యమైన నష్టం వాటిల్లింది. వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ‘అందర్నీ ఆదుకుంటాం..’ అని చెబుతోంది ప్రభుత్వం. ‘ఎవర్నీ...

ఎక్కువ చదివినవి

రెండున్నరేళ్ళు.. అప్పులు తప్ప అభివృద్ధి ఏదీ.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వైఎస్ జగన్, అధికారం కోసం చాలా చాలా...

థమన్ ను బాధకు గురి చేసిన ఎన్టీఆర్ పాట!!

ఎస్ ఎస్ థమన్ ప్రస్తుత ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతోంది, ఏ సాంగ్ కొడితే అది చార్ట్ బస్టర్ గా నిలుస్తోంది. అన్ని సినిమాల్లో...

జస్ట్ ఆస్కింగ్: ఇవి వైసీపీ సర్కారు వైఫల్యాలు కావా.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? ఈ ప్రశ్నకు సమాధానం, ‘ప్రస్తుతానికైతే అమరావతి’ అని. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది.? గతంలో అయితే 2021 జూన్, మొన్నటిదాకా 2021 డిసెంబర్.. ఇప్పుడేమో డేట్ తెలియదు అనే...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

రోశయ్య పద్దు.. తెలుగునాట అప్పటికీ ఇప్పటికీ వెరీ వెరీ స్పెషల్.!

కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగలిగిన అతి కొద్దిమంది నేతల్లో ఆయనా ఒకరు. సౌమ్యుడు, వివాద రహితుడు.. అదే సమయంలో మాటల్లో చతురత చాలా ఎక్కువ. ‘రవ్వంత లేని రేవంత్ రెడ్డీ..’ అని...