కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో విశాల్ ఇటీవలే హైదరాబాద్ కు చెందిన వ్యాపారి కుమార్తె అనిషా రెడ్డి తో హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా జోరు ప్రేమాయణం సాగించారు. అయితే వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న వీరి పెళ్లి జరగనుందట.
అయితే పెళ్లి చెన్నై లో జరుగుతుందా లేక హైదరాబాద్ లోనా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. చెన్నై లో నడిగర్ సంఘం భవనం పూర్తయ్యేదాకా తాను పెళ్లి చేసుకోనని చెప్పిన విశాల్ .. చెప్పినట్టుగానే పట్టు పట్టి నడిగర్ సంఘం భవనం నిర్మాణం చేపట్టాడు.
ప్రస్తుతం అది చివరి దశలో ఉంది. ఆ బిల్డింగ్ పూర్తయ్యాక అందులోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విశాల్. మరి పెళ్లి ఆ భవనంలోనే జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక విశాల్ హీరోగా అటు నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తాజాగా అయన నటించిన టెంపర్ రీమేక్ అయోగ్య ఈ నెల 10న విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే మరో డేట్ ని ప్రకటిస్తారట. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మరో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.