Switch to English

విశాల్ ‘చక్ర’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
Movie చక్ర
Star Cast విశాల్, రెజీనా కాసాండ్ర, శ్రద్ధ శ్రీనాథ్
Director ఎంఎస్ ఆనందన్
Producer విశాల్
Music యువన్ శంకర్ రాజా
Run Time 2 గంటల 10 నిమిషాలు
Release ఫిబ్రవరి 19, 2021

తెలుగు – తమిళ భాషల్లో సూపర్ మార్కెట్ సొంతం చేసుకున్న మాస్ హీరో విశాల్. అభిమన్యుడు తరహాలో సైబర్ క్రైమ్ నేపథ్యంలో చేసిన సినిమా ‘చక్ర’. పలు లీగల్ సమస్యలను ఎదుర్కొని అన్నీ పరిష్కరించుకొని చక్ర మూవీ నేడు రిలీజయింది. ఎంఎస్ ఆనందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో? ఎన్ని సరికొత్త క్రైమ్స్ ని చూపించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఆగష్టు 15న హైదరాబాద్ లో ఒకేసారి పలు చోట్ల 50 దొంగతనాలు జరుగుతాయి. అందులో మిలిటరీలో పని చేస్తున్న చంద్రు(విశాల్) ఇంట్లోని వాళ్ళ ఫాదర్ కి చెందిన అశోక చక్ర మెడల్ ని కూడా దొంగతనం చేస్తారు. దాంతో చంద్రు మిలిటరీ నుంచి వచ్చేసి తన ఫాదర్ మెడల్ ని దొంగిలించిన వాళ్ళ నుంచి వెతికి పట్టుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా ఆ కేసు డీల్ చేస్తున్న గాయత్రి(శ్రద్ధ శ్రీనాథ్) టీంలో జాయిన్ అవుతాడు. ఇక అక్కడి నుంచీ చంద్రు తన టాలెంట్ తో ఆ దొంగతనాల వెనకున్న మాస్టర్ మైండ్ ని ఎలా పట్టుకున్నాడు? పట్టుకునే ప్రక్రియలో ఆ దొంగ నుంచీ చంద్రు అండ్ గాయత్రి టీం ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? వాటిని ఎలా ఛేదించి దొంగని పట్టుకున్నారు? ఆ దొంగ అన్ని దొంగతనాలు ఒకేసారి చేయడానికి గల కారణం ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.

తెరమీద స్టార్స్..

విశాల్ మరొకసారి మిలిటరీ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు.. కేసుని సాల్వ్ చేసే ఆఫీసర్ గా సస్పెన్స్ ని మైంటైన్ చేయడంలో, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు వార్నింగ్ సీన్స్ లో డైలాగ్స్ ఇలా అన్నిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక శ్రద్ధ శ్రీనాథ్ కాప్ పాత్రలో మొదటిసారి మెప్పించింది. సినిమా టీజర్స్, ట్రైలర్స్ లో చూపించకుండా ఉంచిన పాత్ర రెజీనా కాసాండ్ర. నెగటివ్ షేడ్స్ లో రెజీనా సూపర్బ్ పెర్ఫార్మన్స్ చేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో విశాల్ – రెజీనా మధ్య వచ్చే సీన్స్ లో ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీపడేలా బాగా చేశారు. కె ఆర్ విజయ మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా సినిమాని నడిపించిన డైరెక్టర్ ఎంఎస్ ఆనందన్ గురించి మాట్లాడుకుంటే.. కథ పరంగా ఒక సైబర్ క్రైమ్ గురించి చెప్పాలి అనుకున్నాడు. టీజర్స్ మరియు ట్రైలర్స్ చూస్తే ఇదేదో సూపర్బ్ హాకింగ్ సినిమాలా అందరికీ రీచ్ చేశారు కానీ సినిమాలో సైబర్ క్రైమ్ అనే పాయింట్ చాలా చిన్నది అయిపోవడం, సైబర్ క్రైమ్ పాయింట్ చుట్టూ కాకుండా హీరో – విలన్ మధ్య వార్ లా సినిమాని తీసుకెళ్లడం కథలో ఇంపాక్ట్ మిస్ అయ్యేలా చేసింది. కానీ కథనంలో చాలా వరకూ మేనేజ్ చేసాడు. అందుకే సినిమాలో చాలా వరకూ టైం పాస్ అయిపోతుంది. డైరెక్టర్ గా ఆడియన్స్ ని కూర్చో బెట్టడంలో ఒక 60% సక్సెస్ అయ్యాడు. కానీ క్రైమ్ లో పెద్ద మజా లేకపోవడం, చాలా రియలిస్టిక్ పాయింట్స్ చెప్పకుండా వదిలేయడం వలన సినిమా బాగుంది బాలేదు అన్న దానికి మధ్యలో ఉండిపోతుంది.

ఇక టెక్నికల్ టీమ్ చక్ర కి బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. కెటి బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ బాగుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫీల్ ని బాగా క్యారీ చేసాడు. ఆ విజువల్స్ కి మరితం బలం చేకూర్చింది మాత్రం యువన్ శంకర్ రాజా మ్యూజిక్. స్పెషల్ గా హీరో కి విలన్ కి స్పెషల్ గా చేసిన ట్యూన్స్ చాలా బాగున్నాయి. త్యాగి ఎడింగ్ బాగుంది. ఎక్కడా లాగ్ లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్ గా సినిమాని కట్ చేయడం ఒక ప్లస్ పాయింట్. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. విశాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– విశాల్ అండ్ రెజీన కాసాండ్రాల సూపర్బ్ పెర్ఫార్మన్స్
– క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్
– ఇంటర్వల్ బ్లాక్
– ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండ్ ప్రీ క్లైమాక్స్
– విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– కథలో సైబర్ క్రైమ్ యాంగిల్ లైట్ గా ఉండడం
– ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం
– రొటీన్ కాప్ – విలన్ చాలెంజింగ్ సీన్స్
– వీక్ క్లైమాక్స్
– బెటర్ గా ఉండాల్సిన థ్రిల్స్

విశ్లేషణ:

విశాల్ నుంచి వచ్చిన అభిమన్యుడు తరహాలో టీజర్, ట్రైలర్స్ కట్ చేసి, సైబర్ క్రైమ్ జానర్లో సూపర్ సినిమా అంటూ ప్రమోట్ చేసిన చక్ర సినిమా సూపర్ అనే ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది కానీ పరవాలేధనిపించుకుంటుంది. దానికి ప్రధాన కారణం కథ కంప్లీట్ సైబర్ క్రైమ్ యాంగిల్ లో జరగకపోవడం.. ట్రైలర్స్ లో చూపించింది ఒకటి, సినిమాలో ఉండేది ఇంకొకటి కావడం వలన ఆడియన్స్ కాస్త నిరాశ పడతారు. ఓవరాల్ గా విశాల్ నుంచి ఆడియన్స్ ఆశించే తరహాలోనే చక్ర సినిమా ఉండడం వలన కొంత వరకూ నచ్చుతుంది.

చూడాలా? వద్దా?: కమర్షియల్ కాప్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.5/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...