కరోనా రోగులపాలిట విశాఖ ఉక్కు కర్మాగారం కల్పవల్లిగా మారింది. ప్రస్తుతం వారికి అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ ఇతోథికంగా సేవలందిస్తోంది. కరోనా రోగులకు చికిత్సలో మందులతోపాటు ఆక్సిజన్ అత్యవసరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా.. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతున్నా.. వెంటనే వారికి ప్రాణవాయువు అందించాలి. ప్రస్తుతం డిమాండ్ కు తగినరీతిలో ఆక్సిజన్ అందకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ కోసం ఉక్కు కర్మాగారాలపై ఆధారపడుతున్నాయి. ఏపీలో కోవిడ్ ఆస్పత్రులకు అవసరమైన ప్రాణవాయువులో మూడో వంతును విశాఖ ఉక్కు కర్మాగారమే అందజేస్తోంది. ఉక్కు తయారు చేయాలంటే ఆక్సిజన్ తోపాటు నైట్రోజన్, ఆర్గాన్ వాయువులు అవసరం. ఈ నేపథ్యంలోనే ఉక్కు కర్మాగారాలన్నీ ఈ గ్యాస్ లు ఉత్పత్తి చేసే ప్లాంటులు ఏర్పాటు చేసుకుంటాయి.
గాలిలో 20.6 శాత ఆక్సిజన్ 78.03 శాతం నైట్రోజన్, 0.93 శాతం ఆర్గాన్ వాయువులుంటాయి. గాలిని తీసుకుని క్రయోజనిక్ ఎయిర్ సప్రెషన్ విధానంలో ఈ వాయువుల్ని వేరు చేస్తారు. మైనస్ 173 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వీటిని వీరు చేస్తారు. మైనస్ 183 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ వేరవుతుంది. గ్యాస్ రూపంలో ఉన్న ఆక్సిజన్ ను ద్రవరూపంలోకి మారిస్తే 99.9 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఇలా ఆక్సిజన్ తయారుచేసే యూనిట్లు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఉన్నాయి. వాటిలో 24 గంటలూ ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఏపీలోని కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
20030 61892You need to take part in a contest for among the best blogs on the internet. I will suggest this web internet site! 924293
541648 944655Wow! This can be 1 certain of the most valuable blogs We have ever arrive across on this subject. Actually Fantastic. Im also an expert in this topic so I can comprehend your hard work. 706238
808326 79688Respect to post author, some great data . 108282
483230 748812cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id enjoy to add them to my reader 211374