Switch to English

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఆడిట్‌కి పవన్‌ డిమాండ్‌

విశాఖపట్నంలోని గోపాలపురం – ఆర్‌ఆర్‌ వెంకటాపురం ప్రాంతంలో వున్న ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్‌ అవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవడం పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తోందంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. వెంటనే విశాఖపట్నంలో ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఆడిట్‌ జరగాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

‘రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా వుండకుండా, ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వుండాలి. కరినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నేతలకు సూచించాను’ అని జనసేనాని పేర్కొన్నారు.

కాగా, జనసేన పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జనసేన నేత సందీప్‌, బాధితులకు మాస్క్‌లను పంపిణీ చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, బాధితుల్ని తమ వాహనాల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఇదిలా వుంటే, విశాఖకు స్వయంగా వెళ్ళేందుకు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోరినట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యంమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా బాధితుల్ని పరామర్శించేందుకు విశాఖకు పయనమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం విశాఖకు వెళ్ళనున్నారు.

ఏదిఏమైనా, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడి చేయడం, ఆ తర్వాత కాలుష్య కారక పరిశ్రమలకు విచ్చలవిడిగా అనుమతులివ్వడం, పరిశ్రమల్లో భద్రతను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

క్రైమ్ న్యూస్: క్వారంటైన్లో ఉండమన్నందుకు చంపేశారు..

కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇతరులను జాగ్రత్తగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని వివరించి క్వారంటైన్ లో ఉండమన్నందుకు తనతో పాటు మరో వ్యక్తి బలైపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారుణమైన...

దేవుడి భూముల అమ్మకం.. దేవుడే రక్షించుకోవాలేమో..

అసలు హిందూ దేవాలయాలకు పాలక మండళ్ళు ఎందుకు.? దేవాలయాల్ని పరిపాలించడమా.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివి కాదు. కానీ, ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. దేవాలయాల్లోనే ప్రసాదాల అమ్మకాలు.. అదీ అధికారికంగా జరుగుతుంటాయి....

క్రైమ్ న్యూస్: పెళ్లి చేసుకుంటానంటూ వివాహితపై అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఒక మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరి జీవితంను గడుపుతుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురుతో ఒంటరిగా జీవితాన్ని...