Tillu Square: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) మార్చి 29న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్ధు నటించిన ‘డిజే టిల్లు’ తర్వాత నటించిన సినిమా కావడంతో యూత్ సినిమా కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఇప్పటికే రిలిజ్ అయిన ట్రైలర్ యువతను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే.. సినిమా విడుదలకు ఇంకా నెలకు పైగా సమయం ఉన్నా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది టిల్లు స్క్వేర్. సినిమా ఓటీటీ కోసం భారీ పోటీ ఏర్పడింది. ఈక్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘టిల్లు స్క్వేర్’ను భారీ అమౌంట్ కోట్ చేసి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈస్థాయి అమౌంట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
దీనినిబట్టి డీజే టిల్లుతో సిద్ధు యువతలో క్రియేట్ చేసిన ఇంపాక్ట ఏంటో తెలుస్తోందని అంటున్నారు. ట్రైలర్ లో సిద్ధు డైలాగ్స్, హీరోయిన్ అనుపమతో సన్నివేశాలు యూత్ లో భారీ క్రేజ్ తీసుకొచ్చింది.