ఖైదీ నంబర్ 150.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన ఈ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు మాస్ దర్శకుడు వివి వినాయక్. ఆ తరువాత మెగా మేనల్లుడుతో ఇంటిలిజెంట్ అంటూ తీసిన సినిమా అట్టర్ ప్లాప్ గా మిగలడంతో ఆ సినిమా తరువాత వినాయక్ ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయలేదు. ఆ సినిమా తరువాత చాలా మంది హీరోలకు కథ వినిపించినా ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లేటెస్ట్ గా బాలయ్య తో సినిమా అన్నారు కానీ అదికూడా వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా వినాయక్ ఓ మల్టి స్టారర్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే మాస్ దర్శకుడు వినాయక్ తెరకెక్కించే ఓ మల్టి స్టారర్ కోసం రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో హీరోలుగా విక్టరీ వెంకటేష్, నారా రోహిత్ కలిసి నటిస్తారట. ఇటీవలే వీరితో చర్చలు జరిపిన వినాయక్ .. వారిద్దరినుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. అన్నట్టు ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన విక్రమ్ వేదకు రీమేక్ గా ఉంటుందని టాక్? మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సంచలన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడు అదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడట వినాయక్.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. అటు యంగ్, ఇటు సీనియర్ హీరోలతో వరుసగా మల్టి స్టారర్స్ చేస్తూ దూసుకుపోతున్న వెంకీ ఇటీవలే ఎఫ్ 2 తో దుమ్ము రేపాడు. అయితే నారా రోహిత్ కెరీర్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయన ఎన్ని సినిమాలు చేసినా సరైన కమర్షియల్ విజయం మాత్రం దక్కలేదు. ఈ సారి మల్టిస్టారర్ ని నమ్ముకున్నాడు. మరి వినాయక్ అయినా రోహిత్ కు సరైన హిట్టిస్తాడేమో చూడాలి.