ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా నడుస్తోంది. అన్ని భాషల్లో పుష్ప-2 మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పుష్ప-3 గురించి కూడా చర్చ జరుగుతోంది. రిలీజ్ కు ముందే పార్టు-3 గురించి హింట్ ఇచ్చారు. దాంతో పుష్ప-2లో కచ్చితంగా మూడో పార్టుకు లీడ్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ప్రేక్షకులు ఊహించినంత లీడ్ అయితే ఇవ్వలేదు. పార్టు-1లో సెకండ్ పార్టు కోసం మంచి లీడ్ ఇచ్చి వదిలేశారు. కానీ రెండో పార్టులో క్లైమాక్స్ లో కూడా ఆ లీడ్ సరిగ్గా కనిపించలేదు.
పైగా పార్టు-2లో పుష్పరాజ్ జర్నీని మొత్తం చూపించేశారు. ఇందులోనే అతని ఎదుగుదల మొత్తం అయిపోయింది. ఇంటిపేరు సంపాదించడం, ప్రధాన శత్రువులను లేపేయడం అన్నీ జరిగాయి. కాబట్టి ఇంతకు మించి ఇంక పార్టు-3లో చూపించేది కూడా ఏమీ ఉండదనేది ప్రేక్షకుల అభిప్రాయం. అయితే వాస్తవానికి పార్టు-3లో సన్నీడియోల్ ను విలన్ గా చూపించాలని అనుకున్నారంట. ప్రస్తుతం బాలీవుడ్ లో మైత్రీ మేకర్స్ నిర్మాణంలో అతనో సినిమా కూడా చేస్తున్నాడు. కానీ పార్టు-3పై సుకుమార్, అల్లు అర్జున్ అంత గ్యారెంటీగా లేరని సమాచారం.
అందుకే సుకుమార్ కూడా సన్నీడియోల్ ముఖం చూపించకుండా కేవలం వెనక నుంచి ఏదో నీడను చూపించేశారు. ఇప్పట్లో మరో మూడేళ్లు పార్టు-3 కోసం పనిచేసేందుకు బన్నీ సిద్ధంగా లేడని తెలుస్తోంది. ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులు ఆయనకు బోలెడు ఉన్నాయి. కాబట్టి అవన్నీ అయిన తర్వాత.. అప్పటికి సుకుమార్ చేతిలో ఉన్న సినిమాలను కూడా కంప్లీట్ చేశాక చూద్దాం అన్నట్టు వదిలేశారంట. అందుకే ముఖం చూపించకుండా ఏదో అలా హింట్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ముఖం చూపించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం ఇష్టం లేక ఇలా చేసినట్టు తెలుస్తోంది.