చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఈ సినిమా నుంచి విడుదలైన “మనకి మనకి” లిరికల్ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పశుపతి, హరికృష్ణన్, అన్బు దురై కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.