Switch to English

విక్రమ్ రివ్యూ – యాక్షన్ బ్లాక్స్ కొరకే!

Critic Rating
( 2.25 )
User Rating
( 2.30 )

No votes so far! Be the first to rate this post.

Movie విక్రమ్
Star Cast కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్
Director లోకేష్ కనగరాజ్
Producer కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్
Music అనిరుధ్ రవిచందర్
Run Time 2 గం 53 నిమిషాలు
Release 3 జూన్ 2022

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం విక్రమ్. ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మరి ప్రమోలతో ఆకట్టుకున్న విక్రమ్ ఎలా ఉందో చూద్దామా.

కథ:

మిస్ అయిన ఒక కోకైన్ కంటైనర్ కారణంగా వరసగా మర్డర్లు జరుగుతాయి. ఈ కేసును అమర్ (ఫాహద్ ఫాజిల్) అనే అండర్ కవర్ ఆఫీసర్ డీల్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విక్రమ్ (కమల్ హాసన్), సంతానం (విజయ్ సేతుపతి) గురించి తెలుసుకుంటాడు అమర్.

అసలు అమర్ లక్ష్యం ఏంటి? ఈ ముగ్గురి కారణంగా ఎలాంటి పరిస్థితులు సంభవించాయి వంటివి కథకు కీలకం.

నటినటులు:

కమల్ హాసన్ ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. విక్రమ్ పాత్రలో కమల్ స్వాగ్ అదిరిపోయింది. తన లుక్, స్క్రీన్ ప్రెజన్స్ సూపర్బ్ గా సెట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ బ్లాక్ లో తన నటన ప్రత్యేకంగా అనిపిస్తుంది.

ఫాహద్ ఫాజిల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా ఫస్ట్ అంతటా తనే ఎక్కువగా హైలైట్ అవుతాడు. సెకండ్ హాఫ్ లో కూడా ప్రత్యేకంగా అనిపించే పాత్ర అది.

ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పేదేముంది. తను కనిపించే ప్రతీ సీన్ లో అందరినీ డామినేట్ చేసేసాడు. ముగ్గురిలోకి ప్రత్యేకంగా అనిపించే పాత్ర విజయ్ కు దక్కింది.

ఇక ఈ ముగ్గురూ సినిమా అంతటా కమ్మేస్తారు కానీ మిగతా నటులు కూడా తమ పరిధిల మేరకు రాణించారు.

సాంకేతిక నిపుణులు:

ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం వెన్నుముక అని చెప్పవచ్చు. సినిమాలో వచ్చే పాటలు పర్వాలేదనిపించే రీతిలో ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో తన అవుట్పుట్ సూపర్బ్.

ఇక సినిమాటోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ బాగా కుదిరాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా సాగాయి.

ఇక లోకేష్ కనగరాజ్ విషయానికోస్తే డ్రగ్ డీలర్ కాన్సెప్ట్ తో రాసుకున్న ఐడియా బాగుంది. కథకు తగ్గట్లుగా స్టార్ క్యాస్ట్ ను ఎంచుకోవడంతోనే సగం విజయం సాధించేసాడు. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అక్కడక్కడా మెరుపులు తప్పితే విక్రమ్ కొంత గాడి తప్పినట్లు అనిపిస్తుంది.

పాజిటివ్ పాయింట్స్:

  • లీడ్ క్యాస్ట్
  • సంగీతం

మైనస్ పాయింట్స్:

  • నిడివి ఎక్కువ కావడం
  • స్క్రీన్ ప్లే

చివరిగా:

మొత్తంగా చూసుకుంటే విక్రమ్ ఒక సాధారణ యాక్షన్ ఎంటర్టైనర్. కాకపోతే, కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. యాక్షన్ లవర్స్ కు నచ్చే ఈ చిత్రం మిగతావారికి ఓకే అనిపించవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

గోరంట్ల లీక్స్: నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారమా.?

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. ఈ వివాదాన్ని ఎలాగైనా సైడ్ లైన్ చేసెయ్యాలని అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తుండడం...

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.! హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల...

బిగ్ బాస్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. సీజన్...

‘గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించిన పార్టీకే ఓట్లు’ బండి సంజయ్ తో గ్రామస్థులు

తెలంగాణలో బీజేపీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం...