చియాన్ విక్రమ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. తెలుగులో విక్రమ్ నటించిన లాస్ట్ హిట్ ఏదంటే వెంటనే చెప్పడం కూడా కష్టమే. తమిళంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. అయితే వరస ప్లాపుల్లో ఉన్నా కానీ విక్రమ్ సినిమాలకు కొదవ లేదు. వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు విక్రమ్. ఈ స్టార్ హీరో చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కోబ్రా విడుదలకు సిద్ధమవగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ధ్రువ నక్షత్రం రిలీజ్ చిక్కుల్లో పడింది. మహావీర్ కర్ణ అనే మరో సినిమాను చేస్తున్న విక్రమ్ చేతిలో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కూడా ఉంది.
ఈ ప్రాజెక్టులు కాకుండా విక్రమ్, పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే విడుదలైంది. ఇది విక్రమ్ నటించబోయే 60వ సినిమా. అలాగే ఈ సినిమాలో తన కొడుకు ధృవ్ కూడా నటించనున్నాడు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో విక్రమ్ – ధృవ్ ఇద్దరూ రైవల్స్ గా కనిపిస్తారని, విక్రమ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇది నిజంగా ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసే వార్తే. మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
694564 208722Right after study a couple of of the weblog articles for your website now, and that i truly like your method of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls consider my internet website too and inform me what you consider. 342316
772858 373986As soon as I located this internet internet site I went on reddit to share some of the really like with them. 426275