తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ చిత్రం ఈ కరోనా లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే ఇప్పటికే థియేటర్స్ లో సందడి చేసి ఉండేది. స్టార్ హీరోస్ కాస్త స్లోగా వెళుతున్న టైంలో విజయ్ ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న స్పీడ్ కి కరోనా కాస్త బ్రేక్ వేసింది. ఇప్పటికే లేట్ అయ్యిందని భావిస్తున్న మాస్టర్ మేకర్స్ థియేటర్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
విజయ్ గత సినిమా ‘విజిల్’ ని తెలుగు ప్రేక్షకులకు అందించిన యంగ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు మాస్టర్ ని కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ కోసం రెండు రిలీజ్ డేట్స్ ని ఫైనల్ చేశారు. అవే 2020 దీపావళి మరియు 2021 సంక్రాంతి సీజన్. ఈ రెండు సీజన్స్ సినిమా రిలీజ్ లకి పెట్టింది పేరు. ఈ ఏడాది దీపావళి టైంకి అన్నీ సెట్ అయ్యి థియేటర్స్ పర్ఫెక్ట్ గా ఓపెన్ అయితే దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. లేదంటే మాత్రం సంక్రాంతికి వస్తుంది.
దీపావళికి వస్తే పెద్ద సమస్య ఉండకపోవచ్చు.. కానీ 2021 సంక్రాంతికి వస్తే మాత్రం తెలుగులో భారీ పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ని 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే పలు తెలుగు స్టార్ హీరోల సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. కావున విజయ్ కి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది.
832773 36675Hello there, just became alert to your blog by means of Google, and identified that it is truly informative. Im gonna watch out for brussels. I will appreciate should you continue this in future. Lots of people will likely be benefited from your writing. Cheers! xrumer 118206
58402 273192I only wish that I had the ability to convey what I wanted to say in the manner that you have presented this details. Thanks. 834152
804405 773862Likely to commence a business venture around the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects far more by way of the www often. earn funds 597956