Switch to English

ముంపులోనే బెజవాడ.. కృష్ణానదికి మరింత వరద

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

విజయవాడ నగరంపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరద బీభత్సం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. సిటీ, శివారు ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. ప్రాణ నష్టం లేనప్పటికీ.. నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునిగాయి. భారీ స్థాయిలో వాహనాలు దెబ్బతిన్నాయి. వర్షం తగ్గటంతో నగరంలోని ఎగువ ప్రాంతాలు కొద్దికొద్దిగా కోలుకుంటున్నాయి. భూగర్భ డ్రైనేజీ వరద నీటితో కలిసి పోవడంతో తాగునీరు కలుషితమైంది. కృష్ణానదికి వచ్చే వరద తగ్గితే తప్ప లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఇప్పుడప్పుడే మెరుగుపడేలా లేదు.

అసలేం జరిగిందంటే..

శని, ఆదివారాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాగులు, వంకలు పొంగి, తెలంగాణలో పలు చెరువులు తెగిపోవడంతో విజయవాడ ను వరద ముంచెత్తింది. ఫలితంగా బుడమేరు మెయిన్ డ్రెయిన్ పొంగిపొర్లడంతో తీవ్ర నష్టం సంభవించింది. బుడమేరు ప్రవాహ సామర్ధ్యం 10000 క్యూసెక్కులు మాత్రమే. దానిని ఆధునికీకరణ చేసి దాని సామర్థ్యం 17,500 క్యూసెక్కులకు పెంచారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా బుడమేరుకు 45 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. విజయవాడ సమీపాన ఉన్న తెలంగాణలోని దాదాపు 30 చెరువులకు గండ్లు పడ్డాయి. దానిపై అక్కడి అధికారులకు సమాచారం అందలేదు. అయితే ఇంతటి ప్రమాద తీవ్రతను ఏపీ అధికారులు ముందస్తు అంచనా వేయలేకపోయారు. ఫలితంగా ప్రజలను అప్రమత్తం చేసి సమయం లేకుండా పోయింది. లక్షల మంది నిర్వాసితులయ్యారు. రూ. వందల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.

కృష్ణా బ్యారేజీకి మరింత వరద చేరే అవకాశం..

మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో కృష్ణానదికి వరద చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాజెక్టులన్ని వరదనీటితో నిండిపోయాయి. దీంతో దిగువన ఉన్న నీటి ప్రాజెక్టులకు వరద నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో వరద నీరు వదులుతుండటంతో సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి 11.34 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఉండటంతో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విజయవాడ-హైదరాబాద్ హైవే పై రాకపోకల పునరుద్ధరణ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద ఉన్న మున్నేరు వాగుకు వరద తగ్గటంతో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతినిచ్చారు. అంతకుముందు మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో హైవేపై భారీ స్థాయిలో వరద నీరు చేరింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు హైవేపై రాకపోకలను అధికారులు నిషేధించారు. సోమవారానికి వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోకలకు అనుమతినిచ్చారు. దాదాపు 30 గంటల పాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరోవైపు గరికపాడు పాలేటి వంతెన వద్ద తెగిపోయిన జాతీయ రహదారిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు పక్కనే ఉన్న ఎడమ వంతెనను ప్రయాణికులు రాకపోకలకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం: కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది....

పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళ స్నేహం.! రాష్ట్రం కోసమేనన్న చంద్రబాబు.!

ఎన్డీయే కూటమి పదిహేనేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో వుండాలని పదే పదే ఆకాంక్షిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి...

పవన్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం, క్షమాపణలు కోరుతూ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ ప్రముఖ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

బ్రేకింగ్: ఏపీలో మూడు కొత్త జోన్లు: విశాఖ–అమరావతి–రాయలసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని మూడు ప్రధాన జోన్లుగా విభజిస్తూ— విశాఖ జోన్, అమరావతి జోన్, రాయలసీమ జోన్ — ఏర్పాటుకు ఆమోదం తెలిపింది....

మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షా కు వివరించిన లోకేష్–అనిత

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మొంథా తుపాను భారీ నష్టాన్ని మిగిల్చిందని మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదికతో వివరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ...