మాజీ సీఎం జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన సడెన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజ్యసభ ఎంపీ పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఒక్కసారిగా అనేక ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. విజయసాయిరెడ్డి కేసులకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకున్నాడేమో అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయన నిర్ణయంపై జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో విశ్వసనీయత, నిబద్ధత ఉండాలని.. ఎవరి ప్రలోభాలకో లొంగి అటువైపు పోతే ఇంక అర్థం ఏముంది అన్నారు.
విజయసాయిరెడ్డితో పాటు ఇంకో ముగ్గురు వెళ్లిపోయారని.. వారి వల్ల మాత్రమే పార్టీ నిలబడలేదని ప్రజలు, దేవుడి ఆశీస్సులతో మాత్రమే నిలబడిందని చెప్పారు. అయితే జగన్ కు తాజాగా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని వదులుకున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
జగన్ అన్న మాటలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరి మధ్య ఏదో పెద్ద వివాదమే నడిచినట్టు ఉందనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి.