వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండించేశారు. ఖండించాల్సిందే ఎవరైనాసరే.! కాకపోతే, ఈ క్రమంలో విజయ సాయి రెడ్డి బలవంతపు మత మార్పిడుల గురించి ప్రస్తావించారు. 1951లో 22 శాతం జనాభా వున్న హిందువులు, బంగ్లాదేశ్‌లో 2022 నాటికి కేవలం 8 శాతానికి పడిపోయారన్నది విజయసాయిరెడ్డి ఆవేదన.
11 మిలియన్ల మంది హిందువులు, బంగ్లాదేశ్‌లో బలవంతపు మత మార్పిడులకు గురయ్యారంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీటేశారు విజయ సాయి రెడ్డి. ప్రతి యేటా 2.3 లక్షల హిందువులు, బంగ్లాదేశ్‌లో బలవంతపు మత మార్పిడుల బారిన పడుతున్నారట. అలాగని వైసీపీ ఎంపీ తన ట్వీటులో ఆవేదన వ్యక్తం చేసేశారు.
ఇంతకీ, వైసీపీ పాలనలో గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బలవంతపు మత మార్పిడుల సంఖ్య ఎంత.? హిందూ దేవాలయాలపై వైసీపీ హయాంలో జరిగిన దాడుల మాటేమిటి.? అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రధం తగలబడటానికి కారణమెవరు.? రామతీర్థంలో రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేసిందెవరు.?
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో హిందూ మతంపై దాడులు జరిగాయ్. హిందూ సమాజం తీవ్ర ఆవేదనకు గురైంది. ‘విరిగింది దేవుడి బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అంటూ అప్పటి మంత్రి ఒకరు దేవతా విగ్రహాలపై జరిగిన దాడుల గురించి వెటకారపు మాటలు మాట్లాడిన విషయాన్ని చూశాం.
ఓ వైపు హిందూ దేవాలయాలపై దాడులు, ఇంకో వైపు అన్యమత ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించడం.. ఓ వైపు హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలకూ పరిస్థితులు కష్టంగా మారేలా చేసి, ఇంకో వైపు అన్య మత ప్రచారకులకు ప్రజా ధనం దోచిపెట్టడం.. ఇవన్నీ గడచిన ఐదేళ్ళలో ఏపీలో హిందూ మతంపై జరిగిన వ్యూహాత్మక దాడికి నిదర్శనాలే.
ఏపీలో బలవంతపు మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తున్న పార్టీలో కొనసాగుతూ, బంగ్లాదేశ్‌లో బలవంతపు మత మార్పిడుల మీద విజయసాయిరెడ్డి ట్వీటేయడాన్ని ఏమనుకోవాలి.?