తన కాపురంలో విజయసాయి రెడ్డి చిచ్చు పెట్టారంటూ ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. తన భార్యని విజయ సాయి రెడ్డి వలలో వేసుకున్నాడనీ, ఆమెకు జన్మించిన బిడ్డకు అతనే తండ్రి అనీ, డీఎన్ఏ పరీక్షలు చేసి నిజాన్ని నిర్ధారించాలనీ సదరు వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంలో కేంద్ర బిందువైన సదరు మహిళ, ఓ అధికారి. ఎండోమెంట్ డిపార్టుమెంటులో ఆమె విధులు నిర్వహించారట. వైసీపీ పాలన అంతమవగానే, ఆమెపై కొత్త ప్రభుత్వం వేటు వేసిందట. ఆమె పేరుని ఇక్కడ ప్రస్తావించడం సబబు కాదేమో.!
ఇక, ఈ మొత్తం వ్యవహారంపై విజయ సాయి రెడ్డి తాజాగా నేటి ఉదయం పదకొండు గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా మీద.. అరేయ్, తురేయ్.. అంటూ రెచ్చిపోయారు విజయ సాయి రెడ్డి. కొన్ని మీడియా సంస్థల అధినేతల్నీ, కొందరు జర్నలిస్టుల్నీ ఉద్దేశించి, ‘మీ పుట్టకల మీద నాకు అనుమానాలున్నాయ్.. మీ తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలి..’ అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేసేశారు విజయసాయిరెడ్డి.
అక్కడ, బాధిత వ్యక్తి, తన భార్యకు కలిగిన సంతానానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించమని కోరుతూ, అలాగే విజయ సాయి రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విజయ సాయి రెడ్డి నిజంగా తప్పు చేయకపోతే, మీడియా ముందుకొచ్చినప్పుడు తన మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలి.
రాజ్య సభ సభ్యుడు కదా, తనకున్న ప్రత్యేకమైన వెసులుబాట్ల నేపథ్యంలో తాను కూడా ఓ ఫిర్యాదు ఆ వ్యక్తిమీద చేసెయ్యాలి.. పరువు నష్టం దావా కూడా వేసెయ్యాలి. అంతేగానీ, కేసు నమోదయ్యాక, ఆ వివరాల్ని మీడియా ప్రస్తావిస్తే.. మీడియా సంస్థల మీద గుస్సా అవడమేంటి.?
ఇదే విషయమై ఓ జర్నలిస్టు ప్రశ్నిస్తే, ‘‘మనం ఇంతకు ముందు కలవకపోయినా, ఇప్పుడు కలిశాం కదా.. రెండు మూడు సార్లు కలుస్తాం కదా.. అంటే, మనం ‘గే’ అయిపోతామా.?’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. అసలిక్కడ ‘గే’ ప్రస్తావన ఎందుకొచ్చింది. ఈయనసలు రాజ్యసభ సభ్యుడేనా.?
కాస్త లోతుగా ఈ కేసులో పోలీసులు విచారణ చేయాల్సి వుంది. నిజాలు నిగ్గు తేలాలి మరి.!