Vijay Devarakonda: సినిమాల్లో అభిమానులు, ప్రేక్షకులను అలరించే సినీ జంటలు.. నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటైన వారెందరో ఉన్నారు. తెరపై కనువిందు చేసిన జంట నిజమైన జంటగా మారితే అభిమానులకు ఎంతో ఆనందం కూడా. ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోయిన్ తో పెళ్లితో ఒక్కటవబోతున్నట్టు జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న గ్లామర్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ రిలెషన్ లో ఉన్నట్టు ఎప్పటినుంచో గాసిప్స్ వస్తున్నాయి. వారిద్దరూ కలిసున్న ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఇటీవల దీపావళి పండుగ కూడా తన ఇంట్లో ఆమెతో కలిసి జరుపుకున్నట్టు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల ఓ వేదికపై తాను సినిమా హీరోని పెళ్ళడనున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చిందా స్టార్ హీరోయిన్.
ఇప్పుడు వీటన్నింటినీ నిజం చేస్తూ ఆ ప్రేమ జంట అతిత్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో.. రెండు నెలల్లోనే మాల్దీవులు వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు.. కొంతమంది సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందని తెలుస్తోంది. ఈ వార్త విజయ్ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.