టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలు, వెబ్ మూవీస్ చేసుకుంటూ వెళ్తోంది. అయితే కేవలం దక్షిణాదినే కాకుండా నార్త్ లోనూ తనకు వచ్చిన ఆఫర్స్ ను చేజిక్కించుకుని సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ రోజున బాలీవుడ్ కు చెందిన విజయ్ వర్మతో ఓ క్లబ్ పార్టీలో తమన్నా ముద్దులాడుతూ కనిపించింది.
దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని బీటౌన్ లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని మీడియా కంటికి చిక్కడంతో వీరిమధ్య నిజంగానే ప్రేమాయణం సాగుతుందని పలు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై విజయ్ వర్మ రెస్పాండ్ అయ్యాడు. తాను, తమన్నా మంచి ఫ్రెండ్స్ అని.. తామిద్దరం ఓ సినిమాలో కలిసి నటించబోతున్నామని.. అందుకే తామిద్దరం తరుచూ కలుస్తున్నామంటూ ఈ బాలీవుడ్ యాక్టర్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి తమన్నా, విజయ్ వర్మల మధ్య రొమాన్స్ నడుస్తుందని మీడియా వర్గాలు అంటుంటే.. తూచ్.. అదేమీ లేదని వారిద్దరు కొట్టిపరేస్తున్నారు. మరి ఈ జంట మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.