Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఏజీఎస్ సినిమాస్ గ్రూప్ యజమాని కల్పాత్తి ఎస్.సురేశ్ కుమారుడి రిసెప్షన్ కు వీరిద్దరూ ఒకే కారులో వచ్చారు.. కలిసే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, స్టేజిపై ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ విడాకుల అంశం వైరల్ అయిన తర్వాత విజయ్-త్రిష కలిసి కనిపించడం ఇదే. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
విజయ్ నుంచి విడాకులు కోరుతూ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఇటివల పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు, విజయ్ రాజకీయ పార్టీని దాటి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైందీ విషయం. ఓ నటితో విజయ్ కు ఉన్న సంబంధమే ఇందుకు కారణమని సంగీత ఆరోపించడం.. ఎవరా నటి..? అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చుకున్నారు. ఈ సమయంలో అందరికీ షాక్ ఇస్తూ నటి త్రిషతో కలిసి విజయ్ ఓ కార్యక్రమానికి హాజరు కావడం కొత్త చర్చకు దారి తీసింది.
