Vijay Sethupathi: మహేశ్ (Mahesh)-రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. అయితే.. సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇప్పటికీ రాలేదు. అడవి నేపథ్యంలో అడ్వంచరెస్ మూవీ అని.. సినిమా టైటిల్ మహరాజు అని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
అయితే.. టైటిల్ విషయంలో మాత్రం మాహారాజు టైటిల్ బాగా వైరల్ అయింది. మహేశ్ అభిమానులు కూడా దాదాపు టైటిల్ ఇదేనని ఫిక్స్ అయ్యారు. అయితే.. మహేశ్ సినిమా టైటిల్ ఇది కాదని తెలుస్తోంది. ఇదే టైటిల్ తో తమిళ సినిమా విడుదలకు సిద్ధం కావడమే ఇందుకు కారణం. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన 50వ సినిమా మహారాజ పేరుతో జూన్ 14న విడుదల కానుంది.
దీంతో మహేశ్ సినిమా టైటిల్ ఇది కాదనే క్లారిటీకి వస్తున్నారు. మొత్తానికి మహేశ్-రాజమౌళి సినిమా, టైటిల్, కథాంశం, నటీనటులు, సాంకేతిక నిపుణులపై మేకర్స్ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.