Vijay Sethupathi: తమిళంలో సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. ఇటివలే ఆయన కెరీర్లో 50వ సినిమా ‘మహారాజా’తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈక్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను డిప్రెషన్ లో ఉన్నప్పుడు మహేశ్ సినిమానే చూశానని చెప్పడం ఆసక్తి రేకెత్తించింది.
‘కెరీర్లో నేను చేసింది 50 సినిమాలే అయినా.. 500లకు పైగా కథలు విన్నాను. ప్రతి సినిమా నాకో ప్రయాణం. ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను.. నిరుత్సాహానికి కూడా గురయ్యాను. ఆ సమయంలో నేను మహేశ్ సినిమా ‘అతడు’ ఎన్నోసార్లు చూశాను’.
‘సినిమా చూస్తున్నంతసేపూ ప్రశాంతంగా ఉండేది. సినిమా మొత్తం గుర్తుంది. త్రవిక్రమ్ దర్శకత్వం, మహేశ్-త్రిష మధ్య రొమాన్స్, బ్రహ్మానందం కామెడీ సీన్లు ఉత్సాహాన్ని తెప్పించేవి. పాటలు కూడా బాగుంటాయ’ని అన్నారు. 2005లో వచ్చిన అతడు సూపర్ హిట్ అయింది. విజయ్ సేతుపతి కామెంట్స్ ను మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.