వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ కాలిన వర్గం, సజ్జల రామకృష్ణారెడ్డి అనుచర వర్గమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వైసీపీని కొద్ది నెలల క్రితం వీడారు విజయ సాయి రెడ్డి. ఒకప్పుడు వైసీపీలో విజయ సాయి రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. అంటే, నెంబర్ టూ స్థాయిలో అన్నమాట.! రాష్ట్రం మొత్తాన్నీ ఆయనే తన గుప్పిట్లో వుంచుకునేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం. కాకపోతే, సజ్జల రామకృష్ణా రెడ్డి ఎంట్రీతో, విజయ సాయి రెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేసింది వైసీపీ అధినాయకత్వం.
చివరికి వైసీపీ నుంచి విజయ సాయి రెడ్డిని సజ్జల రామకృష్ణా రెడ్డి బయటకు పంపేసిందన్నది జగమెరిగిన సత్యం. కోటరీ అధిపతిగా విజయ సాయి రెడ్డి వ్యవహరించినన్నాళ్ళూ.. విజయ సాయి రెడ్డికి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఎప్పుడైతే, ఇంకో కోటరీని సజ్జల రామకృష్ణా రెడ్డి ఫామ్ చేయడం షురూ చేశారో, అప్పటి నుంచి విజయ సాయి రెడ్డి కోటరీ బలహీనమవుతూ వచ్చింది.
ఇప్పుడు వైసీపీలో ఒకే కోటరీ వుంది.. అదే సజ్జల రామకృష్ణా రెడ్డి కోటరీ. ఆ కోటరీని ఉద్దేశించి విజయ సాయి రెడ్డి చిత్రంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చేశారు.. అదీ వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెత్తనాన్ని ప్రస్తావిస్తూ.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వైఎస్ జగన్ త్వరలో అరెస్టవుతారన్న సంకేతాల్ని విజయ సాయి రెడ్డి పంపడం. అబ్బే, ఇది వైసీపీకి సంబంధించిన అంశం కాదు.. జనరల్ టాపిక్.. అని ముందు ముందు విజయ సాయి రెడ్డి కవరింగ్ ట్వీట్ వేస్తేనో.?
అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!
వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ…— Vijayasai Reddy V (@VSReddy_MP) January 18, 2026
