Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: ఆంధ్రప్రదేశ్‌లో ‘కరోనా రత్న’ ఎవరు.?

వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి తెలియక చేస్తారో, కావాలనే చేస్తారోగానీ.. ఆయన నుంచి దూసుకొచ్చే ట్వీట్స్‌ అధికార పార్టీని అడ్డంగా బుక్‌ చేసేస్తుంటాయి. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఇరకాటంలో పడేసే క్రమంలో విజయసాయిరెడ్డి చూపే అత్యుత్సాహం అధికార వైఎస్సార్సీపీని, అందునా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డినీ అభాసుపాలుచేస్తోంది.

నిన్నటికి నిన్న ‘తప్పదు, గొలుసులతో కట్టేయాల్సిందే..’ అంటూ చంద్రబాబు మీద పరోక్షంగా సెటైర్‌ వేశారు ట్విట్టర్‌ ద్వారా విజయసాయిరెడ్డి. ‘ఏం, ఏడాదిన్నరపాటు గొలుసులతో కట్టేసి జైల్లో పడేసిన విషయం గుర్తుకొచ్చిందా..’ అంటూ టీడీపీ శ్రేణులు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌తోపాటు, విజయసాయిరెడ్డిని సోషల్‌ మీడియా ద్వారా నిలదీయడం గమనార్హం.

కొందరు వైసీపీ మద్దతుదారులకు విజయసాయి ట్వీట్లు బాగానే నచ్చుతున్నా, చాలామంది వైసీపీ నేతలు ఆయన వ్యవహారశౖలిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా, ‘కరోనా రత్న’ అవార్డు పేరుతో విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రశ్న సంధించి, కొన్ని ఆప్షన్స్‌ ఇచ్చారు. అందులో చంద్రబాబు, లోకేష్‌ సహా పలువురు టీడీపీ నేతల పేర్లు గుర్తుకొచ్చేలా ‘పెదనాయుడు’ అనీ, ఇంకోటనీ పేర్కొన్నారు. అట్నుంచి కౌంటర్‌గా, వైసీపీకి చెందిన కొందరు నేతల పేర్లను టీడీపీ మద్దతుదారులు ప్రస్తావిస్తుండడం గమనార్హం.

‘పెదనాయుడు, చిననాయుడు, మలమలకృష్ణరాముడు, దయనేని రమ, భజన చౌ’ అని విజయసాయి పేర్లు పెడితే, ‘విసారెడ్డి, భజన రెడ్డి, గుడివాడ సన్యాసి, నోటిదూల యాదవ్‌, బొత్స నత్తిబాబు, సత్తెనపల్లె ఎర్రిబాబు, నమ్మలేని సీతారాం’ అంటూ టీడీపీ మద్దతుదారులు కౌంటర్‌ ఇచ్చారు.

అంతేనా, ‘బియ్యం రెడ్డి, ఆర్కే లోజ, విడదల వర్జిని, వెంకట్‌ లౌడ, చర్లపల్లి చిప్పకూడు రెడ్డి’ అని కూడా ప్రస్తావించారు కొందరు నెటిజన్లు. ‘జలగం, కసాయి / సీసాయి / విసాయి, గుడివాడ గోళి, తస్సదియ్య నత్తిబాబు, పేరుకుపోయిన నెయ్యి’ లాంటి ప్రస్తావనలూ సోషల్‌ మీడియాలో కన్పిస్తున్నాయి.

ఒక్క ట్వీట్‌తో వంద తిట్లు తినడమెలాగో విజయసాయిరెడ్డికి బాగా తెలుసన్న విషయం ఈ ‘కరోనా రత్న’ ఎపిసోడ్‌తో మరోమారు స్పష్టమవుతోందని వైసీపీ మద్దతుదారులు సైతం మొత్తుకుంటున్నా విజయసాయిలో మార్పు రావడంలేదెందుకో!

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...

‘మత్తు’ డాక్టర్‌ ఎపిసోడ్‌లో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్‌ సర్కార్‌.!

‘మత్తు’ డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంలో అధికార పార్టీకి తిప్పలు తప్పేలా కన్పించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. ‘దళిత కార్డు’ ఓ వైపు, పోలీసుల అత్యుత్సాహం బట్టబయలవడం ఇంకో...

బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను...