Switch to English

దేవుడా.. ఇదస్సలు పబ్లిసిటీ స్టంటే కాదోచ్‌

రాజకీయ నాయకులు చేసే పబ్లిసిటీ స్టంట్లు అభాసుపాలైపోవడం కొత్తేమీ కాదు. ‘అబ్బే, మాకు అస్సలు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరమే లేదు..’ అని చెబుతుంటారు, మళ్ళీ ఆ పబ్లిసిటీ అనే బురదలోనే దొర్లుతుంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు. అయితే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మార్కులు పడతాయి. కానీ, టీడీపీని దాటేయడమెలా.? అన్న విషయమై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు వైసీపీ నేతలు పబ్లిసిటీ విషయంలో.

తాజాగా, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు సంబంధించి ‘ఎఫెక్టెడ్‌ ఏరియాస్‌’లో మంత్రులు ‘బస’ చేశారు. స్థానిక ప్రజానీకంలో భయాందోళనలు పోగొట్టడానికి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రులకు ఈ దిశగా ఆదేశాలు ఇచ్చారు. మంత్రులంతా తమకు తోచిన రీతిలో పబ్లిసిటీ స్టంట్లు చేశారు. ఇక్కడా, తన మార్కు ప్రత్యేకంగా వుండాలనుకున్నారో ఏమో, ప్రత్యేకంగా ఫొటో షూట్‌ ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఓ భవనం మీద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించుకున్నారు ఫొటో షూట్‌ కోసం. ‘ఆరుబయట’ అని చెప్పి, పలు అంతస్తులున్న భవనం మీద కొలువుదీరడమేంటో ఆయనకే తెలియాలి. ఈ వ్యవహారమంతా సమీపంలోని ఇతర భవనాల నుంచి కొందరు షూట్‌ చేసేశారు తమ మొబైల్‌ కెమెరాల్లో. విజయసాయిరెడ్డి అలా మంచమ్మీద కూర్చోవడం, అట్నుంచి ఎడా పెడా ఫొటోలు క్లిక్‌ మనిపించేయడం.. అంతా జరిగిపోయింది.

ఫొటో షూట్‌లో చొక్కా వేసుకుని పడుకున్న విజయసాయిరెడ్డి, మీడియాతో మాట్లాడే సమయంలో మాత్రం చొక్కా తీసేసి, బనియన్‌ని ధరించి మాత్రమే మాట్లాడటం కొసమెరుపు. ఒట్టు, ఇది మాత్రం పబ్లిసిటీ స్టంట్‌ కాదని వైసీపీ నేతలు చెబితే మాత్రం నమ్మడానికి జనం వెర్రి వెంగళప్పలా.?

ఫ్యాక్టరీ నుంచి లీకయ్యింది విష వాయువు కదా.. దానికి డెన్సిటీ ఎక్కువ. అందుకే, విజయసాయిరెడ్డి పక్కాగా ప్లాన్‌ చేసుకుని, ఆ వాయువు ప్రమాదం వుండనంత ఎత్తులో ‘బస’ చేసి, దానికి అదనంగా ఫొటో సెషన్లు జోడించారంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్‌.. అన్నాడు వెనకటికి ఓ సినీ కవి. 12 మంది ప్రాణాలు కోల్పోతే, ఆ ప్రాంతంలో ‘బస’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసిన నేతల్ని ఏమనాలి.?

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...