గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించడమేంటి అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి భార్య సునంద యొక్క చెల్లి కూతురు అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఆ కారణంతో విజయసాయి రెడ్డి మరియు తారకరత్న బంధువులు అయ్యారు. అందుకే వరుసకు అల్లుడు అయ్యే తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించాడు.
తారకరత్నను పరామర్శించిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తారకరత్న బయటకు వస్తాడని ఆశిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
329081 255443For some cause the picture just isnt loading appropriately, is at this time there an issue? 532908
409189 503745Your blog is showing far more interest and enthusiasm. Thank you so a lot. 144691