Switch to English

విజయసాయిరెడ్డికి సీబీఐ మీద అంత నమ్మకమెలా వచ్చిందబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏంటో..) విజయసాయిరెడ్డి, సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఇంట్రెస్టింగ్ ట్వీట్లు వేశారు. అదీ, టీడీపీ నేత దివంగత కోడెల శివప్రసాద్ గురించీ, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి గురించీ.

‘ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలున్నాయి. మా చంద్రన్న వేధించాడ? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. సీబీఐ దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా..’ అన్నది ఓ ట్వీటు.

ఇంకో ట్వీటులో ‘అప్పట్లో కోడెలది గుండెపోటు అన్నారు. తర్వాత ఉరి వేసుకున్నారని చెప్పారు. ఆయన మొబైల్ మాయం చేశారు. ఉమామహేశ్వరి గారిదీ సహజ మరణమని నమ్మించాలని చూశారు. చంద్రబాబుకి దగ్గరివాళ్ళే ఎందుకిలా అర్థాంతరంగా చనిపోతున్నారు.?’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

నిజమే, ఇక్కడ విజయసాయిరెడ్డి వ్యక్తం చేసిన అనుమానాల్లో అర్థం వుంది. సీబీఐ విచారణ కూడా జరిగితే మంచిదే. కానీ, ఎప్పుడు.? సీబీఐ విచారణలో నిజాలు నిగ్గుతేలతాయనే నమ్మకాలున్నప్పుడు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ, విజయసాయిరెడ్డినీ అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసినప్పుడు మాత్రం, సీబీఐ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది.. అది పంజరంలో చిలక.! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను స్వయంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి కోరితే, ‘అవసరం లేదు..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు విన్నవిస్తారు.

అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే, దాన్ని గుండె పోటుగా చిత్రీకరించిన ఘనత వైసీపీదే కదా.! ఆ కేసులో వైసీపీ వద్దనుకున్నా సీబీఐ విచారణ జరుగుతోంది.. కానీ, విచారణ కొన‘సాగు’తోందంతే.! అలాంటి సీబీఐ, కోడెల విషయంలో అయినా, ఉమామహేశ్వరి విషయంలో అయినా నిజాలు నిగ్గు తేల్చుతుందని ఎలా అనుకోగలం.?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంగతేంటి.? ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, ఆ ఘటన వెనుక అనుమానాలున్నాయని తరచూ వైసీపీ ఆరోపిస్తుంటుంది. వైసీపీ చేతిలోనే ఇప్పుడు అధికారం వుంది. ఆనాటి ఆ కేసుని తిరగతోడి.. నిజాల్ని నిగ్గు తేల్చొచ్చు కదా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...