గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా స్పందించిన ఆయన, “గుజరాత్ మాజీ సీఎం శ్రీ విజయ్ రూపాణీ జీ అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించడం అత్యంత దుఃఖకరం. ఈ విషాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది” అని పేర్కొన్నారు.
విజయ్ రూపాణీ రాజకీయ జీవితం కేవలం పదవుల కోసం కాకుండా ప్రజాసేవ పట్ల నిబద్ధతతో సాగిందని పవన్ కల్యాణ్ ట్విటర్ లో పేర్కొన్నారు.
The tragic demise of the former CM of Gujarat, Sri @vijayrupanibjp Ji, in the Air India flight crash that occurred in Ahmedabad, along with other passengers, is deeply devastating. His journey was more than political – it was a true commitment towards public service. I express my…
— Pawan Kalyan (@PawanKalyan) June 13, 2025
