ఈ మద్య కాలంలో దర్శకులు ఏడాదికి ఒకటి.. రెండు సంవత్సరాలకు ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా పూర్తి అయిన తర్వాత చాలా నెలల తర్వాత తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. కాని యంగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రం పనులతో బిజీగా ఉండి కూడా మరో సినిమా షూటింగ్‌ను ఈ దర్శకుడు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా ఉంది.
ఒరేయ్ బుజ్జిగా చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే నిఖిల్ గౌడతో ఒక చిత్రాన్ని చేసేందుకు ఈయన కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఆ సినిమాను మొదలు పెట్టాడు. కన్నడ హీరో.. రాజకీయ నాయకుడు అయిన నిఖిల్ గౌడతో ఒక విభిన్నమైన ప్రేమ కథను తెరకెక్కించేందుకు విజయ్ కుమార్ కొండ ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిపి షూటింగ్‌ను మొదలు పెట్టారట. షూటింగ్ గ్యాప్‌లో ఒరేయ్ బుజ్జిగా నిర్మాణానంతర కార్యక్రమాలు చేస్తున్నారు.
ఒకేసారి రెండు సినిమాల పనులు గతంలో దర్శకులు చేసేవారు. ఈమద్య కాలంలో ఏ దర్శకుడు కూడా అంతటి సాహసం చేయడం లేదు. కాని దర్శకుడు విజయ్ కుమార్ కొండ మాత్రం రెండు సినిమాలను ఒకేసారి చేయడం నిజంగా అతడి ఘట్స్కు మెచ్చుకోవాలి. ఒరేయ్ బుజ్జిగా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, నిఖిల్ గౌడ సినిమాను కూడా మరీ ఆలస్యం చేయకుండా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.
36604 777142Hey there! Excellent post! Please do tell us when we shall see a follow up! 420552
377229 164171Great weblog, Im going to spend far more time reading about this subject 775592
198651 266566Superb post but I was wanting to know in case you could write a litte more on this topic? Id be quite thankful should you could elaborate just a little bit much more. Thanks! 332689