ఇళయదళపతి .. తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బిగిల్ అనే టైటిల్ పెట్టారు. తమిళ్ లో బిగిల్ అంటే విజిల్ అనే అర్థం. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు విజయ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ పోస్టర్స్ ని విడుదల చేసారు.
ఒకేసారి రెండు పోస్టర్స్ విడుదల చేయడంతో విజయ్ ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఈ పోస్టర్స్ ని బట్టి చుస్తే విజయ్ రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు .. అంటే ఇందులో అయన డ్యూయెల్ రోల్ చేస్తున్నాడన్న సందేహాలు కలుగుతున్నాయి ? ఈ వార్తలను నిజం చేసేలా .. ఒకటి ఫుట్ బాల్ ప్లేయర్ గా ఉంటె మరొకటి గ్యాంగ్ స్టర్ గా లుక్ ఉంది. మొత్తానికి విజయ్ – అట్లీ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా సంచలనం రేపడం ఖాయమనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
తేరి, మెర్సల్ సినిమాలు ఏ రేంజ్ లో దుమ్ము రేపాయో.. వాటిని మించేలా అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే అటు బిజినెస్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను దీపావళి సందర్బంగా విడుదల చేస్తారట.