బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా సంపాదించి అమాయక ప్రజలను బలి చేస్తున్నారని పోలీసులు అలాంటి వారి మీద ఉక్కు పాదం మోపుతున్నారు.
ఐతే తాజాగా ఈ కేసులో విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. టాలీవుడ్ సెలబ్రిటీస్ లో విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని.. అతనిపై కూడా పోలీసులు యాక్షన్ కి రెడీ అవుతున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది.
విజయ్ దేవరకొండ స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం చేశాడని.. ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వెల్లడించింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉన్నారని చెప్పారు.
అంతేకాదు విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అన్నది ఆయన టీమ్ పరిశీలిస్తుందని వెల్లడించారు. ఆ కంపెనీ, ఆ ప్రొడక్ట్ చట్ట ప్రకారం అనుమతి ఉందని తెలిస్తేనే విజయ్ ఆ యాడ్ కు ప్రచార కర్తగా ఉంటారని అన్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు కూడా తెలియచేసిందని విజయ్ టీమ్ చెప్పింది.
ఏ 23 అనే సంస్థతో విజయ్ దేవరకొండ అగ్రిమెంట్ గతేడాదితో ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.