విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మేగజైన్స్ మీద కనిపించిన ఈ రౌడీ హీరో.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజీపై మెరిశాడు.
ప్రఖ్యాత ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ విజయ్ దేవరకొండను తన కవర్ పేజీగా పబ్లిష్ చేసింది. ఇందులో ‘విజయ్ దేవరకొండ ది మ్యాన్ ఆన్ ఎ మిషన్’ అనే టైటిల్ కూడా ఇచ్చింది. ఇందులో విజయ్ ను ప్రశంసిస్తూ ఇలా రాసుకొచ్చింది.
‘ఆత్మవిశ్వాసం, ఆకర్షణ ఉట్టిపడే విజయ్ దేవరకొండను మేము క్యాప్షన్ చేశాం. తన కొత్త సినిమా కింగ్డమ్ తో విజయ్ ఒక లక్ష్యంతో సాగుతున్నారు..’ అనే క్యాప్షన్ తో ఈ మేగజైన్ పబ్లిష్ చేసింది. ఈ మేగజైన్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. విజయ్ కు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం ఆయన కింగ్ డమ్ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీని జులై 4న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. త్వరలోనే మూవీ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగవంశీ నిర్మించారు.



