విజయ్ దేవరకొండ సొంతంగా ఎదిగిన హీరో. పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా చాలా తక్కువ టైమ్ లోనే పెద్ద స్టార్ అయిపోయారు. ఇప్పుడు వరుసగా సినిమాలు తీస్తున్నాడు. రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చాడు. పరశురామ్ తో ఆయనకు ఇది రెండో సినిమా. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ కాంబో రిపీట్ అయ్యే సరికి పెద్ద హిట్ అవుతుందనుకుంటే బోల్తా పడింది ఫ్యామిలీ స్టార్. ప్రస్తుతం మూడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు మన హీరో.
అయితే విజయ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన మాస్ మహారాజ్ రవితేజ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. గతంలో రవితేజ, నయనతార కాంబోలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆంజనేయులు. ఈ సినిమాకు విజయ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఓ సీన్ లో విజయ్ కెమెరా పట్టుకుని కనిపిస్తాడు. ఆ మూవీకి విజయ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఓ సన్నివేశంలో విజయ్ ను చూపిస్తాడు దర్శకుడు. ఈ సినిమా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నా.. కమర్షియల్ గా లాభాలు తేలేకపోయింది.
విజయ్ ముందు దర్శకుడు కావాలనుకున్నా.. ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు గౌతమ్ తిన్నమూరితో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గనక హిట్ అయితే మాత్రం మనోడికి మళ్లీ బూస్ట్ వచ్చినట్టే అంటున్నారు. విజయ్ దీని తర్వాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు.