Switch to English

రౌడీ బాబు తర్వాతి సినిమా అదేనట

రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. తనకు ఇలాంటి ఇమేజ్ ఇష్టమంటున్నాడు. మొదట్లో వరస హిట్స్ తో మంచి ఊపు మీద కనిపించాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా వంటి హిట్స్ తో విజయ్ టాప్ రేంజ్ కు చేరుకోవడంఖాయమనుకున్నారంతా. అయితే వరసపెట్టి డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు విజయ్ ఆశలపై నీళ్లు చల్లాయి.

ఈ రెండు సినిమాలూ కూడా విజయ్ రేంజ్ ను బాగా కిందకి దించేసాయ్. అయితే విజయ్ ఫుల్ ఫ్లో లో ఉన్న సమయంలో మొదలుపెట్టిన హీరో ప్రాజెక్ట్ విజయ్ డౌన్ లో ఉండేసరికి సైడ్ అయిపోయింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్ర రషస్ చూసిన తర్వాత విజయ్ ఈ చిత్రాన్ని పక్కకు పెట్టేసాడు. ముందుగా పూరి జగన్నాథ్ తో ఫైటర్ చిత్రాన్ని తీసి తర్వాత హీరో సంగతి చూద్దామనుకున్నాడు.

ఫైటర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే పూరి స్పీడ్ గురించి తెలియంది కాదు. మళ్ళీ షూటింగ్ కు అనుమతులు వస్తే రెండే రెండు నెలల్లో సినిమాను సిద్ధం చేసినా చేసేస్తాడు. అయితే ఫైటర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది చర్చనీయాంశమైంది.

ఫైటర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దాని తర్వాత మరో ప్యాన్ ఇండియా మూవీ చేస్తాడని కరణ్ జోహార్ ఈసారి మెయిన్ పార్ట్నర్ గా ఉంటాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజాలు కావని గతంలో శివ నిర్వాణ చెప్పిన కథకు ఓకే చెప్పిన విజయ్ ఆ ప్రాజెక్ట్ కే కమిట్ అవ్వనున్నాడని, హీరో చిత్రాన్ని పూర్తిగా సైడ్ చేసినట్లేనని అంటున్నారు. శివ నిర్వాణ ప్రస్తుతం నానితో టక్ జగదీష్ తీస్తున్నాడు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

ఒక్క పూట భోజనం కోసం 24 కి.మీ కాలి నడక ప్రయాణం

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం, ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ కుటుంబం గతంలో మంచి ఆస్తుపరులు. ఆయన తోబుట్టువులు మరియు ఇతర కుటుంబ సభ్యులు బాగానే సెటిల్‌ అయ్యారు. కాని రామకృష్ణ...

పుల్వామా తరహా కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

భారత భద్రతా దళాలపై 2019లో ఉగ్రవాదులు చేసిన పుల్వామా ఎటాక్ అంత తేలిగ్గా మరచిపోయేది కాదు. 40మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న ముష్కరులు అదే తరహాలో మరో భారీ కుట్రకు ప్రయత్నించారు. దీనిని...

భారత్ – ఆస్ట్రేలియా బంధాన్ని బలోపేతం చేస్తున్న ‘సమోసా’

ఒక సమోసా రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సమోసా.. ఏంటి దేశాల మధ్య స్నేహం ఏంటి.. అనుకుంటున్నారా. ఇది నిజమే. భారతీయ చిరుతిండి (స్నాక్) సమోసా ఆస్ట్రేలియా ప్రధానిని...

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు. నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా రన్ టైం: 86 నిముషాలు విడుదల తేదీ: మే 29,...