Kingdom : రౌడీస్టార్ విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి ‘కింగ్డమ్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు. దాంతో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లోని విజువల్స్ వందల కోట్ల మూవీ ఇది అనే ఫీల్‌ను కలిగిస్తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో సినిమా ఉండబోతుందని టీజర్‌తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పే ప్రయత్నం చేశారు.
‘కింగ్డమ్’ టీజర్ తెలుగు వెర్షన్‌కి ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు అని యూనిట్ సభ్యులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే ఆయన లుక్ అద్భుతంగా ఉంది. ‘కింగ్‌డమ్’ టీజర్ కోసం ఎదురు చూస్తున్న వారికి మాంచి కిక్ ఇచ్చారు. టీజర్‌తో పాటు సినిమాను మే 30, 2025న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండను సరికొత్త అవతార్‌లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చూపించబోతున్నారు. టీజర్ రౌడీ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచడమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ కింగ్డమ్ పై అంచనాలు పెంచింది. అనిరుధ్ రవిచందర్ మరోసారి పవర్ ఫుల్ విజువల్స్‌కి తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి టీజర్ స్థాయిని పెంచారు. టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ డైలాగ్స్‌తో హీరో పాత్రకు విపరీతమైన ఎలివేషన్ దక్కింది. చివర్లో విజయ్ దేవరకొండ చెప్పే అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ‘కింగ్డమ్’ టీజర్‌ను ఇక్కడ చూడండి.