విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ టీజర్ లేటెస్ట్ గా రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. విజయ్ నుంచి ఇలాంటి సినిమా మేము కోరుతున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఐతే విజయ్ కింగ్ డమ్ గురించి నిర్మాత నాగ వంశీ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా మీరు ఊహించని విధంగా సినిమా ఉంటుందని చెబుతూ వచ్చారు. టీజర్ చూస్తే ఆయన చెప్పింది నిజమే అన్నట్టుగా ఉంది. ఐతే ఇదే క్రమంలో నాగ వంశీ కింగ్ డమ్ రెండు భాగాలుగా వస్తుందని కూడా చూచాయగా చెప్పారు. ఈమధ్య వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు అన్నీ కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కూడా అదే తరహాలో రెండు భాగాలుగా వస్తుందని అనుకున్నారు. ఐతే రిలీజైన టీజర్ లో కింగ్ డమ్ పార్ట్ 1 అని ఏమి హింట్ ఇవ్వలేదు. ఒకవేళ తర్వాత ప్రమోషన్స్ లో ఏమైనా సర్ ప్రైజ్ చేస్తారేమో చూడాలి. విజయ్ దేవరకొండకి ఈ కింగ్ డమ్ కచ్చితంగా కెరీర్ లో ఒక మర్చిపోలేని సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది. కింగ్ డమ్ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా బాగా హైప్ తెచ్చేలా చేసింది.