Virosh: ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతటా విజయ్ దేవరకొండ-రష్మిక వివాహ సందడే. ‘విరోష్’ పేరుతో జరుగుతున్న వీరి పెళ్లి రేపు (ఫిబ్రవరి 26) రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో బంధువులు, శ్రేయోభిలాషుల మధ్య జరగనుంది. అయితే.. పెళ్లిలో నో ఫోన్ పాలసీని ఫాలో అవుతున్నారు అంటే ‘అన్ ప్లగ్గడ్ వెడ్డింగ్’. అంటే, అతిధులెవరూ వీరి పెళ్లిని ఫోన్లలో బంధించి సోషల్ మీడియా అప్డేట్స్ గా ఇవ్వకూడదు. ముందే అతిధులు ఫోన్లు డిపాజిట్ చేయాలి, లేదంటే స్విచ్ఛాఫ్ చేయాలి.
ఇందుకు కారణం అఫిషియల్ ఫొటోగ్రాఫర్లకు స్పేస్ ఇవ్వడం.. తామే అధికారికంగా తమ పెళ్లి ఫొటోలు ఇచ్చేవరకూ బయటకు వెళ్లకూడదని. ఇలాంటి ‘అన్ ప్లగ్గడ్ వెడ్డింగ్’ ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం విరాట్ కోహ్లీ-అనుష్క పెళ్లితోనే. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రణబీర్-అలియా భట్ వివాహాలు కూడా ఇదే పద్ధతిలో జరిగాయి. దీంతో పెళ్లి అనేది వ్యక్తిగతమని తెలియజేస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండ-రష్మిక కూడా దీనిని పక్కాగా ఫాలో అవుతున్నారని టాక్.
