తమిళ నటుడు మరియు నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీని స్టార్ గా మార్చిన బ్లాక్ బస్టర్ సూపర్ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా రిలీజై సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా వచ్చి నాలుగు సంవత్సరాలయినా కూడా తెలుగు ప్రేక్షకులు విజయ్ ఆంటోనీని ‘బిచ్చగాడు’ నటుడు గానే గుర్తిస్తున్నారు. విజయ్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్ గా ‘బిచ్చగాడు’ మాదిరి బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోలేకపోయాయి.
ఈ నేపధ్యంలో విజయ్ తనకు లైఫ్ ఇచ్చిన ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో పూర్తి సమయాన్ని ‘బిచ్చగాడు-2’ స్క్రిప్ట్ కోసం కేటాయించాను. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శశి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించటం లేదు. లాక్ డౌన్ ముగిసి షూటింగ్ లకు అనుమతి రాగానే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాను. వచ్చే ఏడాదికి విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ఈ భాగానికి కూడా సంగీత బాధ్యతలను నేనే నిర్వర్తిస్తాను. ఈసారి ప్రొడక్షన్ విలువలను మరింత పెంచుతూ చిత్రాన్ని తెరకెక్కిస్తాను. సాంకేతిక నిపుణులు, ఇతర తారాగణం వంటి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను’ అని వివరించారు.
కాగా నిర్మాతల కష్టం తెలిసిన విజయ్ కరోనా కారణంగా చిత్రీకరణలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న నిర్మాతల మేలు కోరి తన పారితోషికంలో 25శాతం భాగాన్ని తగ్గించుకున్నారు. లాక్ డౌన్ సమయంలో తన సమయాన్ని వృధా చేసుకోకుండా ఎడిటింగ్ మరియు నటనలో మెళకువలు తెలుసుకుంటూ మెరుగులు దిద్దుకుంటున్నారు.
లాక్ డౌన్ అనంతరం పరిశ్రమ ఎలా ఉండబోతుందనుకుంటున్నారని ప్రశ్నించగా ‘చాలినంత పొదుపు చేసిన వారి పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అప్పులు తెచ్చి సినిమాలు తీసే నాలాంటి వారికి కష్టకాలమే. ప్రభుత్వం షూటింగ్ అనుమతులు ఇవ్వగానే లొకేషన్ కు వెళ్ళేవారిలో మొదటగా ఉండేది నేనే’ అని జవాబిచ్చారు.
276973 361753Today, while I was at work, my sister stole my iphone and tested to see if it can survive a 40 foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now destroyed and she has 83 views. I know this is completely off topic but I had to share it with someone! 759269
778678 256269you got a very superb website, Sword lily I located it by way of yahoo. 549847