Vicky Kaushal: దుబాయ్ (Dubai) లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్దుడు (ఐఫా-2023) (IIFA) మీడియా సమావేశం సందర్భంగా విక్కీ కౌశల్ పై సల్మాన్ ఖాన్ (Salman Khan) , ఆయన బాడీగార్డుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ అభిమానులు సల్మాన్ మంచి మనస్తత్వం ఇదంటూ పోస్ట్ చేసిన వీడియోలో సల్మాన్ స్వయంగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) ను ఆలింగనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై విక్కీ కౌశల్ కూడా స్పందించారు. ‘సోషల్ మీడియాలో ఒక్కోసారి చిన్న విషయాలు కూడా పెద్దవిగా కినిపిస్తాయి. అందరూ అనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు. అసలు దాని గురించి మాట్లాడటానికి కూడా ఏం లేదు. అనవసర విషయాలు ఎక్కువగా హైలైట్ అవుతూంటాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు’ అని అన్నారు.
విక్కీ కౌశల్ ఫొటోలు దిగుతూండగా అటుగా సల్మాన్ వచ్చారు. దీంతో ఆయన భద్రతా సిబ్బంది విక్కీని పక్కకు తోసేశారు. సల్మాన్ కూడా విక్కీ పలకరించినా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఆ వీడియోపైనే విక్కీ స్పందించారు.
https://twitter.com/Freak4Salman/status/1662185545450274816?s=20