తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయాన్. ఈ మూవీని దసరా కానుకగా 10వ తేదీన పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే మూవీ రిలీజ్ కు ముందే తెలుగులో దీని నేమ్ చేంజ్ చేశారు. వేట్టయాన్ ను కాస్తా వేట్టయాన్-హంటర్ గా మార్చేశారు. అయితే తెలుగులో ఇలా పేరు మార్చడంపై తాజాగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్బంగా వారు ఎందుకు మార్చాల్సి వచ్చిందో క్లుప్తంగా వివరించారు. తాము ముందు వేట్టయాన్ ను వేటగాడుగా రిలీజ్ చేయాలని అనుకున్నారంట.
కానీ తెలుగు వెర్షన్ లో టైటిల్ మారిస్తే.. సినిమా అసలు ఇమేజ్ తెలుగులో తగ్గిపోతుందని భావించారు. పైగా వేటగాడు టైటిల్ తో ఇది వరకే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ చిక్కుముడులు ఉండొద్దనే ఉద్దేశంతో వేట్టయాన్-హంటర్ పేరుతో తెలుగుతో పాటు మిగతా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అసలు పేరుతోనే రిలీజ్ చేస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రజినీకాంత్ సినిమా వేట్టయాన్ అని ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త పేరు మార్చడం వర్కౌట్ కాదని వారు ఆలోచించారు.
ఇక రజినీ మూవీలో బడా స్టార్లు కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ లాంటి వారు నటిస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సాంగ్స్ భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. మరి మూవీ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.