సినీ నటుడు వేణుమాధవ్‌కి అస్వస్థత, పరిస్థితి విషమం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,472FansLike
57,764FollowersFollow

సినీ నటుడు వేణుమాధవ్‌ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో వేణుమాధవ్‌కి వైద్య చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాలేయ సమస్యలతోపాటు, కిడ్నీ సమస్యలతో వేణు మాధవ్‌ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వేణుమాధవ్‌ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం విదితమే. అయితే, తాను పూర్తి ఆరోగ్యంతో వున్నాననీ, పలు సినిమాల్లో నటిస్తున్నాననీ చాలా ఇంటర్వ్యూల్లో వేణుమాధవ్‌ చెప్పుకొచ్చాడు.

తన ఆరోగ్యంపై కొందరు కుట్రపూరితంగా కథనాలు వండి వడ్డిస్తున్నారంటూ వాపోయారాయన. ఆ ప్రచారమే తనకు సినిమా అవకాశాలు రాకుండా చేసిందనీ ఆవేదన వ్యక్తం చేశారు వేణుమాధవ్‌. కమెడియన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వేణు మాధవ్‌, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మిమిక్రీ, వేణుమాధవ్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఆ మిమిక్రీ కళని నటనకు జోడించి, వేణుమాధవ్‌ అవకాశాల్ని దక్కించుకోవడమే కాదు, విజయాల్ని కూడా అందుకున్నారు.

స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న దశలో, హీరోగానూ అవకాశాలు రావడంతో, అటు వైపూ అడుగులు వేశారు. నిర్మాతగానూ ఒకటి రెండు సినిమాలు నిర్మించి, నష్టపోయారు వేణుమాధవ్‌. సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ వేణుమాధవ్‌ పేరు ఒకప్పుడు గట్టిగానే విన్పించింది. తెలుగుదేశం పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడు.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇదిలా వుంటే, వేణుమాధవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.

3 COMMENTS

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ఎక్కువ చదివినవి

“జగదేక వీరుడు అతిలోక సుందరి”..పై నాని ఎమోషనల్ వీడియో!

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్‌గా మాత్రమే కాదు.. ఒక యుగంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో Jagadeka Veerudu Athiloka Sundari ఒకటి. మెగాస్టార్ Chiranjeevi హీరోగా, దివంగత...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కాబోయే ట్రైలర్ గురించి బయటకు వస్తున్న...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్ వైరల్

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో...

Daily Horoscope: కన్య వారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

మే 11 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో మంచి మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి....