Switch to English

‘రామారావు ఆన్ డ్యూటీ” నటుడిగా చాలా తృప్తిని ఇచ్చింది: వేణు తొట్టెంపూడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సిఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల నేపధ్యంలో విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు వేణు. ఆయన పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి.

”దమ్ము” తర్వాత సినిమాలు చేయకపోవడానికి కారణం ?

నిజానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా వున్నాయి. బిజినెస్ లో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలకు వెబ్ సీరిస్లు చూడ్డం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్ మండవ రామారావు ఆన్ డ్యూటీ కథ చెప్పారు. కథ అద్భుతంగా వుంది. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది.

సిఐ మురళి పాత్ర చేయడనికి ఆసక్తి కలిగించిన అంశం ?

ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. అలాగే రామారావు ఆన్ డ్యూటీ వైడ్ రీచ్ వున్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఆసక్తితో ఈ సినిమా చేశా. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేను డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి వుండేది. కానీ రామారావు ఆన్ డ్యూటీలో నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. రామారావు ఆన్ డ్యూటీ తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

స్వయంవరం లో మీతో కలసి చేయాలనీ రవితేజ గారు చెప్పారు కదా? దాని గురించి ?

నిజంగా దాని గురించి అంతకుముందు నాకు తెలీయదండీ. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీతో మా కాంబినేషన్ కుదిరింది. మొదటి నుండి నేను మల్టీ స్టారర్ కి మొగ్గు చూపేవాడిని. ‘చిరునవ్వుతో’ లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ వెంటనే హనుమాన్ జంక్షన్ చేశాను. చాలా మంది నటీనటులతో కలసి నటించడం అంటే అదొక పండగ. హనుమాన్ జంక్షన్ కూడా ఒక పండగలా గడిచింది.

మీ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు.. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు.. ఆయన సినిమాల్లో పాత్రల కోసం మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారా?

తన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర వుంటే ఖచ్చితంగా చెప్తారు. అతడు సినిమాలో సోనూ సూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారు. ఈ పాత్రకి వేణు బావుంటాడని అనిపిస్తే తప్పకుండా చెప్తారు.

రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్ వుంటారు.

మొదటి సినిమాకి ఇప్పటికీ ఒకేలా వున్నారు.. మీ ఫిట్ నెస్ సీక్రెట్ ?

మంచి ఆహరం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు లేదు. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్ కు దూరంగా వుంటాను. ఇక మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం.

సినిమాలని కంటిన్యూ చేస్తారా ?

ఖచ్చితంగా సినిమాలని చేస్తా. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా ద్రుష్టి వుంది.

కొత్తగా చేయబోతున్న ప్రాజెక్ట్స్ ?

ఛాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరిస్ కూడా చర్చల్లో వుంది.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Ram Charan Birthday Special: రామ్ చరణ్ వన్ మ్యాన్ షో.. రెండో సినిమాకే రికార్డులు

Ram Charan: చిరంజీవి (Chiranjeevi) వారసుడు అంటే చిరంజీవి పేరు నిలబెట్టాలంతే..! వేరే ఆప్షన్ లేదు. అప్పటికి 28ఏళ్లుగా తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన బలమైన ముద్ర.. సృష్టించిన ప్రభంజనం అటువంటిది. చిరంజీవి...