నందమూరి బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ చేయించిన అల్లు అరవింద్ ఇప్పుడు వెంకటేష్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. సీజన్ 1 ను ముగించబోతున్నట్లుగా ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆహా టీమ్ కొత్త షో ను వెంకటేష్ తో చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కాగా వెంకీ మామ తో ఒక గేమ్ షో ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో కూడా సెలబ్రెటీలే రాబోతున్నారు. వెంకటేష్ తో చేయించబోతున్న ఆ టాక్ షో కు సంబంధించిన విషయాలు వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరు చేయని విభిన్నమైన కాన్సెప్ట్ తో ఆహా టీమ్ వెంకటేష్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 1 ముగిసిన వెంటనే వెంటకేష్ కొత్త సీజన్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ కు ఇలాంటి షో లు కొత్త. కనుక ఆయన ఎలా చేస్తాడు అనేది చూడాలి. ఓటీటీ కోసం వెంకటేష్ ఇప్పటికే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. కనుక గేమ్ షో ఆయనకు కొత్త ఏమీ కాదన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.