విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 చిత్ర విజయం తరువాత నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ, ఈ చిత్రానికి కేఎస్. రవీంద్ర ( బాబీ ) దర్శకత్వం వహిస్తున్నాడు . నిజ జీవితం లో మేనల్లుడైన నాగ చైతన్య ఈ సినిమా లో వెంకీ తో పాటు నటిస్తున్నాడు . పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా హెరాయిన్ లుగా చేయనున్నారు . ఈ సినిమా నిర్మిస్తున్న సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ అధినేత సురేష్ బాబు మాట్లాడుతూ వెంకటేష్ తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా అయినా విక్రమ్ వేద లో నటించడం లేదని తేల్చి చెప్పారు .
గత కొన్నాళ్లుగా వెంకటేష్ ఈ చిత్రం లో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండడం తో అందులో నిజం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం వెంకీ మామ సినిమా తో బిజీ గా ఉన్న వెంకటేష్ తరువాత చిత్రానికి సంబందించిన ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికార ప్రకటన చేస్తామని చిత్రవర్గాలు ద్వారా తెలిపారు ..