Switch to English

వెంకటేష్ ‘నారప్ప’ మూవీ రివ్యూ : ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా

Critic Rating
( 2.75 )
User Rating
( 3.80 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow
Movie నారప్ప
Star Cast వెంకటేష్, ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల
Director శ్రీకాంత్‌ అడ్డాల
Producer ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు
Music మణిశర్మ
Run Time 2 hr 33 Mins
Release 20 జూలై 2021

వెంకటేష్‌ ‘నారప్ప’గా ప్రియమణి ప్రధాన పాత్రలో ఈ సినిమా థియేటర్లలో వస్తుందని అంతా ఎదురు చూశారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నారప్ప ను డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందంటూ నిర్మాతలు ఈ సినిమాను అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సెకండ్‌ వేవ్‌ తర్వాత డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల అయిన పెద్ద సినిమా ఇదే. అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈసినిమా ఎలా ఉంది అనేది చర్చిద్దాం రండీ.

కథ :

నారప్ప(వెంకటేష్‌) కుటుంబం గ్రామం నుండి పారిపోతూ ఉండగా కథ మొదలు అవుతుంది. అనేక ఘోరమైన సంఘటనలు జరిగిన నేపథ్యంలో నారప్ప కుటుంబం అత్యంత పెద్ద చిక్కుల్లో చిక్కుంది. గతంలో జరిగిన సంఘటలు మరియు నారప్ప జీవితంలో అంతకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది. తన కుటుంబంను కాపాడుకునేందుకు నారప్ప చేసిన ప్రయత్నం ఏంటీ.. అసలు నారప్ప కుటుంబం గ్రామం నుండి పారిపోవడానికి కారణం ఏంటీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తెర మీద స్టార్స్‌…

వెంకటేష్ నారప్ప పాత్రకు ప్రాణం పోశాడు. కొన్ని సన్నివేశాల్లో తాను ఓ స్టార్‌ హీరోను అనే ఇమేజ్ ను పక్కన పెట్టి నటించాడు. ఆయన కాస్ట్యూమ్స్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ నారప్ప పాత్రకు జీవం పోసినట్లుగా ఉన్నాయి. కుటుంబం కోసం తపనపడే సన్నివేశాల్లో వెంకటేష్‌ నటన చాలా బాగుంది. కథ మొత్తంను కూడా తన భుజాలపై వేసుకుని మరీ వెంకటేష్‌ సినిమాను నడిపించాడు. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం నటన బాగుంది. పాత్రకు తగ్గట్లుగా ఆవేశపూరిత పాత్రలో కార్తీక్ నటన బాగుంది. ప్రియమణి మరియు రాజీవ్‌ కనకాల కూడా వారి పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటించారు. సినిమాలోని మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేసేలా నటించి మెప్పించారు.

తెర వెనుక టాలెంట్..

కొత్తబంగారు లోకం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటీ ఫీల్‌ గుడ్‌ మూవీస్ ను తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల ఇలాంటి సినిమాను తెరకెక్కించాడంటే నిజంగా ఆశ్చర్యమే. తమిళ అసురన్‌ సినిమాకు ఒక్క సీన్ ను జత చేయడం లేదా ఒక్క సీన్ ను తొలగించలేదు. కాని స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం కాస్త మార్పులు జరిగాయి. సబ్జెక్ట్‌ ను కూడా స్వల్పంగా మార్చడం జరిగింది. ఫ్ల్యాష్‌ బ్యాక్ సన్నివేశాల విషయంలో వివాదాలు లేకుండా జాగ్రత్తగా అడ్డాల కథను కొనసాగించడం లో సఫలం అయ్యాడు.

మణిశర్మ అందించిన నేపథ్యం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇంటర్వెల్ లాంటి కొన్ని కీలక సీక్వెన్స్ లోని బ్యాగ్రౌండ్ స్కోర్ కి అయితే గూస్ బంప్స్ వస్తాయి. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి. వాటిని మరింతగా ట్రిమ్ చేసి ఉంటే సినిమా స్పీడ్ గా సాగేది.

విజిల్ మోమెంట్స్:

  • వెంకటేష్ నటన,
  • బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ,
  • ఇంటర్వెల్‌ మరియు క్లైమాక్స్,
  • ఎమోషనల్ కంటెంట్.

బోరింగ్ మోమెంట్స్:

  • ఒరిజినల్ ను దించేయడం,
  • ఫ్ల్యాష్‌ బ్యాక్‌ సన్నివేశాల కథనం,
  • కొన్ని సన్నివేశాలు రా కంటెంట్ ను కలిగి ఉన్నాయి.

విశ్లేషణ:

అసురన్‌ కు నారప్ప అసలైన రీమేక్. ఎక్కడ అదనపు సన్నివేశాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దించేశారు. అసురన్ ను దించేసినా కూడా వెంకటేష్‌ నటనతో ఆకట్టుకున్నాడు. స్టోరీ లైన్ కు తగ్గట్లుగా తెలుగు లో కూడా సన్నివేశాలను మార్చకుండానే రీమేక్ చేశారు. అసురన్‌ చూడకుండా ఓపెన్‌ మైండ్‌ తో ఈ సినిమా చూసే వారికి తప్పకుండా నారప్ప నచ్చుతాడు.

చూడాలా? వద్దా? : వెంకటేష్ అభిమానులు ఖచ్చితంగా చూడవచ్చు. కమర్షియల్‌ సినిమా ప్రియులకు  నచ్చేది అనుమానమే.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

13 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...