మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రం షూటింగ్ దాదాపు పూర్తీ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రేపు అంటే 15న హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వరుణ్ .. కోబ్రా రానున్నాడు ? వరుణ్ కోబ్రా .. అంటే ఆయన ఎవరు ? అంటూ షాక్ అవ్వకండి .. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతికి విడుదలై సంచలన విజయం అందుకుంది.
ఆ సినిమాలో వెంకటేష్ కు తోడల్లుడిగా వరుణ్ నటించాడు. దాంతో వెంకీ ని కోబ్రా అంటే కో బ్రదర్ అంటూ పిలుస్తూ ఆటపట్టించాడు. ఇప్పుడు ఆ కోబ్రా నే వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాకు చీఫ్ గెస్ట్. తాజాగా వెంకటేష్ ఈ వేడుకకు వస్తున్నట్టు యూనిట్ కన్ఫర్మ్ చేసింది. 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల చివరలో విడుదల కానుంది.
