Switch to English

‘కమ్మ’గా సొంత గూటికి: ‘చిలక’ పలుకులెలా వుంటాయో.!

సీనియర్‌ జర్నలిస్ట్‌ వెంకటకృష్ణ పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. చిత్రమేంటంటే, సినిమా సెలబ్రిటీలకు ధీటుగా ఇప్పుడు సీనియర్‌ జర్నలిస్టులకు ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. ‘ఆ.. డబ్బులిస్తే.. ఫేక్‌ ఫాలోవర్స్‌ ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు.. చెప్పినట్లు ట్వీట్లేస్తారు.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ లోనూ భజన చేస్తారు..’ అనే ట్రెండ్‌ ఈ మధ్య బాగానే నడుస్తోందనుకోండి మీడియాలో కూడా.!

అసలు విషయంలోకి వచ్చేద్దాం. వెంకటకృష్ణ గతంలో పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ‘ఏపీ24X7’ అనే ఛానల్‌ని స్థాపించారు. వెంకటకృష్ణ లైవ్‌ షోని చాలామంది ఆసక్తిగా తిలకించేవారు కూడా. తమది న్యూట్రల్‌ ఛానల్‌ అనీ, మిగతా ఛానళ్లలో చాలవరకు ఆయా పార్టీలకు అమ్ముడుపోయాయనీ ఆయనే పలు సందర్భాల్లో సెటైర్లు వేసిన మాట వాస్తవం. ‘కుల మీడియా’ అన్నారు, రాజకీయ మీడియా అన్నారు.. ఇంకేవేవో అన్నారు. కానీ, ఇప్పుడాయన తాను స్థాపించిన ‘ఏపీ24X7’ ఛానల్‌ వదిలేసి, పాత గూటికి ‘కమ్మ’గా చేరిపోయారు.

సోమవారం నుంచి ఏబీఎన్‌ ఛానల్‌లో ఆయన తన ‘ప్రతాపం’ చూపించబోతున్నారు. ఏబీఎన్‌ ఛానల్‌లో చేరాక, ‘న్యూట్రల్‌గా..’ అన్న మాటకు తావుండదు. ఏబీఎన్‌ అంటే, తెలుగుదేశం పార్టీకి మౌత్‌పీస్‌ అన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అదే ఛానల్‌ మీద పరోక్షంగా ‘ఏపీ24X7’ వ్యవస్థాపకుడి హోదాలో సెటైర్లు వేసిన వెంకటకృష్ణ, ఇప్పుడు అదే గూటికి చేరడం వెనుక చాలా కారణాలున్నాయి.

రాజకీయ ఒత్తిళ్ళకు తోడు, అంతర్గతంగా తలెత్తిన వివాదాలతో వెంకటకృష్ణ, ‘ఏపీ24X7’ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇంతకీ, ఏబీఎన్‌ ఛానల్‌ తరఫున వెంకటకృష్ణ ‘చిలక’ పలుకులు ఎలా వుంటాయి.? ఇక్కడ ‘కులజాడ్యం’ లేకుండా ఆయన తన పాత్రికేయ వృత్తిని నిర్వర్తించగలరా.? అన్న విషయమై మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

నో డౌట్స్‌.. అద్భుతాలేమీ జరగవు.. ఏబీఎన్‌ ఛానెల్‌కి వున్న పొలిటికల్‌ ఎజెండా ప్రకారమే వెంకటకృష్ణ పనిచేయబోతున్నారు. సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు చేస్తున్నదీ అదే.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

మిడతల దండుతో విమానాలకూ ప్రమాదమే.. ఎలాగంటే

కరోనాతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య భయపెడుతోంది. దేశం యావత్తూ చర్చనీయాంశమైన ఆ అంశమే ‘మిడతల దండు’. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా.. వంటి రాష్ట్రాల్లో వీటితో పంట...

కైలాష్ ఖేర్ ‘మ్యాడ్’ మూవీ పాటకి మంచి స్పంద‌న.!

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫ‌స్ట్ లుక్...

తెలంగాణలో మరిన్ని సడలింపులు.. రాత్రివేళా బస్సులు.!

‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేంత సాధన సంపత్తి మనదేశంలో లేవు. అందువల్ల లాక్ డౌన్ ముమ్మాటికీ పాటించాల్సిందే. మన తీసుకునే ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష’’ – ఇటీవల పలు సందర్భాల్లో...

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....

క్రైమ్ న్యూస్: 9 ఏళ్ళ బాలికపై 14 ఏళ్ళ బాలుడి అఘాయిత్యం.. ప్రతిఘటించడంతో ఏం చేశాడంటే

సినిమాల ప్రభావమో లేదా సోషల్‌ మీడియా ప్రభావమో కాని 15 యేళ్లు కూడా నిండకుండానే అబ్బాయిలు అత్యంత కఠినంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు తాను చదువుకునే...