Robinhood: నితిన్-శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంక కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమాపై ఓ అభిమాని పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. దీనికి దర్శకుడు వెంకీ కుడుముల సమాధానం ఇవ్వడం ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే..
‘వెంకీ అన్నా.. ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు “భీష్మ” రూపంలో హిట్ ఇచ్చావు. ఇప్పుడు మళ్లీ నితిన్ తో “రాబిన్ హుడ్” తెరకెక్కిస్తున్నావ్. రిలీజ్ లేటైనా పర్వాలేదు. మాకు హిట్ కావాల’ని వెంకీని ట్యాగ్ చేశాడు. దీనికి వెంకీ రిప్లై ఇస్తూ.. ‘మూవీ ఎడిటింగ్ లాక్ చేసి చెప్తున్నా బ్రదర్. “రాబిన్ హుడ్” తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్’ అని రిప్లై ఇచ్చారు.
“రాబిన్ హుడ్” సినిమాలో నితిన్ దొంగగా నటిస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.