మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఏడాదిలో రెండు మూడు సినిమాలకు కమిట్ అవుతున్న ఈ యంగ్ హీరో తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఈయన్ను ముకుంద చిత్రంతో పరిచయం చేసింది శ్రీకాంత్ అడ్డాల విషయం తెల్సిందే. తనకు మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం డౌన్ ఫాల్‌లో ఉన్నాడు. అందుకే ఆయన్ను ఆదుకునేందుకు ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
గత ఏడాది గద్దలకొండ గణేష్ చిత్రంతో వరుణ్‌కు మంచి సక్సెస్ దక్కింది. ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీలు నిర్మించారు. ఇప్పుడు మరోసారి వారి బ్యానర్‌లో సినిమాను చేసేందుకు వరుణ్ ఓకే చెప్పాడు. అలా ఈ కాంబో సెట్ అయ్యింది. ముకుంద సినిమాతో పరిచయం అయ్యి గత ఏడాది గద్దలకొండతో సక్సెస్ కొట్టిన వరుణ్ ఈ ఏడాది ఆ కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సినిమా కోసం వరుణ్ వర్కౌట్స్ చేస్తున్నాడు. కిరణ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు పుకార్లే అని తేలింది. త్వరలోనే హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించబోతున్నారు.
మరో వైపు అసురన్ రీమేక్‌ను వెంకటేష్‌తో నారప్పగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. సమ్మర్ వరకు నారప్ప షూటింగ్ పూర్తి చేసి ఆవెంటనే వరుణ్ తేజ్ మూవీని శ్రీకాంత్ అడ్డాల మొదలు పెట్టే అవకాశం ఉంది. ఫ్లాప్‌ల్లో ఉన్న అడ్డాలకు ఈ రెండు సినిమాలు బూస్ట్ ఇస్తాయా చూడాలి.